నల్లగొండ వన్‌టౌన్ సీఐగా బాధ్యతల స్వీకరణ

16-11-2026 | 09:54pm

నల్లగొండ నవంబర్ 16 : (విజయ క్రాంతి ): నల్లగొండ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్(One Town Police Station) నూతన సీఐగా క్రాంతికుమార్(CI Kranthikumar) బాధ్యతలు స్వీకరించారు. సంగారెడ్డి నుంచి బదిలీపై వచ్చిన ఆయన వన్‌టౌన్ సీఐగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గంజాయి, అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ దందాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడతామని తెలిపారు. ప్రజలకు ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే డయల్ 112కు సమాచారం అందించాలని సూచించారు.

మరిన్ని వార్తలు