సిర్గాపూర్ లో 17 న చేయూత పెన్షన్ పత్రాల పంపిణీ
16-11-2026 | 09:57pm
సిర్గాపూర్ నవంబర్ 16(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలంలోని 28 గ్రామ పంచాయతీల(Village Panchayats) పరిధిలో అర్హులైన వారికి కొత్తగా 387 ఆసరా పింఛన్లు మంజూరైనట్లు ఎంపీడీవో ఆండాలమ్మ తెలిపారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, దివ్యాంగులకు పింఛన్లు కేటాయించినట్లు వెల్లడించారు. మండల పరిషత్ కార్యాలయం వద్ద ఈ నెల 17న మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటకు చేయూత పెన్షన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో అండాలమ్మ తెలిపారు.