జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు
బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగం గౌడ్
దామరచర్ల :నవంబర్ :16 జాతీయ పత్రిక దినోత్సవం(National Press Day) సందర్భంగా జర్నలిస్ట్ సోదరులకు బిసి జెఏసి రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగం గౌడ్(BC JAC State Convener Jajula Lingam Goud) శుభాకాంక్షలను తెలియజేశారు.ఈ సందర్భంగా దామరచర్ల లో ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికా రంగం నాలుగో స్తంభంగా కీలక పాత్ర పోషిస్తోందని, సమాజంలోని సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో జర్నలిస్టుల కృషి ఎంతో గొప్పదన్నారు.
ప్రజలకు వాస్తవాలను తెలియజేస్తూ, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తూ, ప్రజాస్వామ్య పరిరక్షణకు జర్నలిస్టులు చేస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. ముఖ్యంగా అణగారిన వర్గాలు, బడుగు బలహీన వర్గాల సమస్యలను సమాజం దృష్టికి తీసుకురావడంలో మీడియా మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.
జర్నలిస్టులు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ సమాజ హితం కోసం నిరంతరం పనిచేస్తున్నారని, వారి హక్కులు, భద్రత, సంక్షేమం కోసం ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల కలం ప్రజాస్వామ్యానికి బలం కావాలి. సమాజ మార్పుకు అక్షరమే ఆయుధం కావాలన్నారు.