సాహితీ సౌర‘బంగా’!

16-11-2026 | 05:05am

‘భారత సాంస్కృతిక వారసత్వంలో బెంగాల్ సంగీత, సాహిత్యం ఆచంద్రతారార్కం’

భిన్నత్వంలో ఏకత్వం గల భారతదేశం అనేక అం శాల మేళవింపుతో సుసంపన్నమవుతూ అనేక శతాబ్దాలుగా వర్ధిల్లుతున్నది. ముఖ్యంగా మన సాంస్కృతిక వారసత్వంలో పశ్చిమ బెంగాల్ సంగీత(West Bengal Music), సాహిత్య భాగస్వామ్యం అత్యంత విశిష్టమైనది. బెంగాల్ చరిత్ర, భౌగోళిక పరిస్థితులు, ఆధ్యాత్మిక చింతన, సాంప్రదాయా లు, కవితా పరిమళం, విజయగాథలు సుసంపన్నమైనవ.

గ్రామీణ ప్రాంతాల వారు తేలికగా పాడుకునే మధుర గీతాల నుంచి ఆధునిక కాలంలో విరాజిల్లిన ప్రసిద్ధ కవు ల కవిత్వం, పాటలు, జానపద గీతాలతో బెంగాల్ సాం స్కృతిక వారసత్వం గుబాళించింది. తరతరాలుగా తన సంస్కృతీసంప్రదాయాలను నిలుపుకుంటూ నేటికీ సంగీ త సాహిత్య సౌరభాలు విరబూయిస్తున్నది. 

బౌల్స్ ఆఫ్ బెంగాల్, పడవ ప్రయాణికుల పదనిసలు, రవీంద్రనాథ్ ఠాగూర్ రచనలు, బిష్ణుపూర్ ఘరానా వంటి సంగీత సాహిత్యంతో అటు ఆధ్యాత్మిక చింతన, ఇటు పక్రృతి మరియు సామాజిక చైతన్యం, సృజనాత్మకతతో బెంగాల్ సంగీతం.. భారత సాంస్కృతిక వారసత్వ చరిత్రలో ప్రత్యే క ముద్ర వేసుకుంది. బెంగాల్ సంగీతం..

జానపద గీతా లు, ఆధ్యాత్మిక ఉద్యమాలు, హిందూస్తానీ శాస్త్రీయ సంగీతంతో రోజురోజుకు కొత్తపుంతలు తొక్కింది. దైవప్రేమ, మానవ సంబంధాలు, సామాజిక అసమానతలను రూపుమాపేందుకు, దేశభక్తి పెంచేందుకు, ప్రకృతి ఆరాధన, ఆధ్యాత్మిక చింతనతో జీవితం గడిపే వంటి అద్భుత మైన అంశాలను ఆలంబనగా చేసుకొని వర్ధిల్లుతున్నది.

బౌల్ సంగీతంతో దేవుని దర్శనం..

బెంగాల్ సంగీతంలో విలక్షణమైనది బౌల్ సంగీత సాంప్రదాయం. మానవులను దైవంతో, తన చుట్టూ ఉన్న ప్రపంచంతో అనుసంధానం చేసే అంశాలను మేళవించి చక్కటి ఆధ్యాత్మిక పాటలతో అలరించే కచేరీ వారు..

ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి తిరుగుతూ, పాటలు పాడుతూ ప్రజల్లోకి విస్తృతంగా పర్యటిస్తూ ఉండే వ్యక్తులు. ముఖ్యంగా మతఛాందస భావాలను విడనాడి, మానవత్వాన్ని ప్రభోదించే వారు. వీరు స్వయంగా పాడుతూ, మూడు రకాలైన ‘ఏక్తారా‘ ఒక తీగతో కూడిన వాయిద్యం, ‘దోతారా’ అనగా తంత్రీ వాయిద్యం, ‘దుగ్గి‘  తబలా వంటి వాయిద్యాలతో ఊరూరా తిరుగుతూ ఉండేవారు.

అందరికీ అర్థమయ్యేలా చిన్నచిన్న పద ప్రయోగాలతో ఒకవైపు విష్ణు విశిష్టత, మరోవైపు సూఫీతత్వము ప్రజలకు తెలియజేస్తూ బెంగాల్ ప్రజల్లో తాత్వికచింతన, ఆధ్యాత్మిక ధోరణి పెంచడం ద్వారా బౌల్ సంగీతం ప్రసిద్ధి చెందింది. ‘యునెస్కో‘ వారిచే గుర్తింపు పొంది, విశ్వవినుతికెక్కింది. 

జానపదులు..

బెంగాల్‌లో ఉన్న వివిధ వృత్తులు, భౌగోళిక పరిస్థితులు, ప్రాంతాలు.. ప్రజల మానసిక పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని రకరకాల జానపద గీతాలు పరవళ్లు తొక్కాయి. ముఖ్యంగా ‘భటియాలి‘ గీతాలు పడవ ప్రయాణికులతో కలిసి అలరించాయి. ఉత్తర బెంగాల్‌లో ‘భావయ్య‘ జానపదులు ప్రేమ, ఎడబాటు, రోజూవారీ సమస్యలపై చక్కటి బోధనలుగా ఉండేవి.

ముఖ్యంగా వ్యవసాయ, రవాణా రంగంలోని గ్రామీణ ప్రజల మనస్సులను ఈ జానపదులు తాకేవి. ‘ఝమర్‘ జానపద నృత్యాలు కూడా బెంగాల్ సాహిత్యప్రపంచంలో ముఖ్యంగా పురులియా, బంకురా ప్రాంతాల ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నాయి. 

శ్యాం సంగీత్‌లో దైవభక్తి..

బెంగాల్ సంగీతంలో దైవభక్తికి ప్రాధాన్యం ఎక్కువ. ముఖ్యంగా వైష్ణవ సాంప్రదాయం ఫరిడవిల్లేది. రాధాకృష్ణుల ప్రణయగాథలతో మమేకమయ్యేది. ముఖ్యంగా ‘చైతన్య ప్రభువు’ ప్రబోధించిన కృష్ణతత్వం బెంగాల్‌లో ప్రాచుర్యం పొందింది. కాళీమాతను కీర్తిస్తూ పలు  పాటలు ‘శ్యాం సంగీత్’ ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లాయి. ఇప్పటికీ ఈ శ్యాం సంగీత్ బెంగాల్ ప్రజల్లో జీవన విధానంలో ఒకటిగా నిలిచింది.

బిష్ణుపూర్ ఘరానా...

పశ్చిమ బెంగాల్ సంగీతంతో బిష్ణుపూర్ ఘరానా ప్రముఖ స్థానం పొందింది. హిందూస్తానీ శాస్త్రీయ సంగీతంతో బిష్ణుపూర్ ఘరానా ప్రముఖమైనది.. మల్లా పాలకులు సంగీతానికి, ఇతర కళలకు ప్రాధాన్యత ఇచ్చేవారు.. దీంతో ప్రస్తుతం బంకురా జిల్లాలో ఉన్న బిష్ణుపూర్ సంగీతానికి నిలయంగా వర్ధిల్లింది..

ఘరానా అనే అంశం రాగాన్ని చక్కగా పలకడానికి, చక్కటి మధురమైన నిర్మాణానికి, పల్లవి పై ప్రభావం చూపడానికి ఉపయోగపడుతుంది.. ముఖ్యంగా హిందూస్తానీ శాస్త్రీయ సంగీతంతో ఒక విధమైన ప్రత్యేకత సంతరించుకుకోవడానికి, రాజకుటుంబీకుల ఆదరణ మన్ననలు పొందడానికి ఘరానా ఎంతగానో తోడ్పడింది.. దీంతో బిష్ణపూర్ లోనే సంగీత పాఠశాల ఏర్పాటు చేశారు..

ఎంతోమంది కళాకారులు, కవులు, మ్యూజిషియన్లు బిష్ణుపూర్ రావడం జరిగింది.. ‘ సేనియా సాంప్రదాయం‘ అనగా తాన్ సేన్ సంగీత వారసత్వం.. అభివృద్ధి పరిచారు..‘ బహుదుర్ ఖాన్‘,  మరియు ఆర్.భట్టాచార్య వంటి ఎందరో మహానుభావులు సంగీత సాహిత్య సౌరభం పెంపొందించారు.. బెంగాల్ సంగీతంలో, జానపద గీతాలలో, ఆధ్యాత్మిక చింతనలో బిష్ణుపూర్ ఘరానా ప్రముఖమైనది... బెంగాల్ సంగీతంలో విలక్షణమైనది.. సంగీతాన్ని సుసంపన్నం చేసింది.. నేటికీ ఆ వారసత్వ గుబాళింపులు దేశవ్యాప్తంగా వెదజల్లుతుంది..

విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్..

బెంగాల్ సాంస్కృతిక చరిత్ర లో రవీంద్రనాథ్ ఠాగూర్ రచనలు కవిత్వం పాటలు చిరస్మర ణీయమైన గుర్తింపు పొందాయి. సుమారు 2000 రచనలతో ఠాగూర్ బెంగాల్ సంగీత, సాహిత్యంలో సవ్యసాచిగా నిలిచారు. స్థానిక జానపద కళారూపాలు, హిందూస్తానీ సంగీతం, సాంప్రదాయాలు, ఇతర సాహిత్య సమ్మేళనాలు ఠాగూర్‌పై ప్రభావాన్ని చూపాయి.

అంచేతనే ఆయన రచనలు, కవిత్వం, పాటల్లో మానవత్వం, ప్రకృతి ఆరాధన, ఆధ్యాత్మిక చింతన, దేశభక్తి, మానవ సంబంధాలు, స్వేచ్ఛ వంటి అంశాలే అక్షర మాలికలై అల్లుకున్నాయి. బెంగాల్ పునరుజ్జీవంలో ఠాగూర్ రచనలు భాగమయ్యాయి. యూరప్ ఖండమవతల దాటి వర్షించిన ఆయన సాహిత్యపు చినుకులకు 1913లో సాహిత్యరంగంలో నోబెల్ పురస్కారం ఠాగూర్‌ను వరించింది.

తన సాహిత్యంతో భారతావనికి దేశభక్తితో కూడిన (జనగణమన) జాతీయగీతాన్ని అందించారు. బంగ్లాదేశ్ జాతీయగీతం ‘అమర్ సోనార్ బంగ్లా’ ఆయన కలం నుంచి జాలువారినదే. ఆనంద్‌మఠ్ రచన ద్వారా బకీంచంద్ర ఛటర్జీ పేరు ప్రఖ్యాతులు పొందారు. వందేమాతరం గేయం బెంగాల్ విభజ న సమయంలో ప్రజలను ఐక్యంగా ఉంచడంలో, బ్రిటీష్ వారి పాలనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమ నిర్మాణంలో కీలకపాత్ర పొషించింది.   

నజ్రూల్ గీతాలు..

నజ్రూల్ గీతీ.. ఖాజీ నజ్రూల్ ఇస్లాం రాసి పాడిన పాటలు బెంగాల్ సంగీతంలో సాహిత్యంలో నూతన అధ్యాయం సృ ష్టించింది. ఈయన రచనలు బెంగాల్ ప్రజల్లో చైత న్యం కలిగించాయి. అందుచేతనే ఈయనను ‘విప్లవికవి‘గా బెంగాల్ సాహిత్యంలో పేర్కొన్నారు. మంచి రచనతో పాటు ఉద్రేకం కలిగించేవిగా ఈయన రచనలు సాగిం చారు..

అరబిక్, పెర్షియన్ ప్రభావంతో బెంగాలీలో జాన పద గీతాలు రచించారు. బెంగాల్ సంగీతంలో ‘ఘజల్‘ ఒరవడి ప్రవేశపెట్టారు. హిందూ, ముస్లిం సాహిత్య సాం ప్రదాయ బద్దంగా, రెండు మతాల అంశాలు కలగలిపి రచనలు చేశారు. అప్పటి బ్రిటిష్ సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా అన్యాయాలపై గొంతెత్తారు. మత ఛాందస భావాలకు వ్యతిరేకంగా రచనలు చేశారు.

1960లో పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. ఈ విధంగా భార త సాంస్కృతిక వారసత్వంలో బెంగాల్ సంగీతం, సాహి త్య పరంగా తన చారిత్రక నేపథ్యం కలిగి ఉంది..దేశ ప్రజ లను బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి విముక్తి చేయడానికి, ఆనాటి సంఘంలో ఉన్న దురాచారాలు పారదోలడానికి, సమాజంలో ప్రేమ, దైవ భక్తి, దేశభక్తి సేవాభావం పెం పొందించడానికి, మానవత్వమే దైవత్వం అని చాటిచె ప్పిన ఈ బెంగాల్ సాహిత్యం పాత్ర అమోఘమైనది.

రాజారామ్ మోహన్‌రాయ్ కాలం నుండి, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకా నంద, బకీంచంద్ర ఛటర్జీ, రవీంద్రనాథ్ ఠాగూర్, ఖాజీ నజ్రూల్ ఇస్లాం వరకూ తమతమ రచనలు, కవిత్వం, పాటలు సమాజానికి దిక్సూచీగా నిలిచాయి.

బౌల్స్ ఆఫ్ బెంగాల్, భటియాలి జానపద కళారూపాలు, హిందూ స్తానీ శాస్త్రీయ సంగీతం, బిష్ణుపూర్ ఘరానా, ఝమర్ జానపద నృత్యాలు, శ్యాం సంగీత్ వంటి పలు సంగీత సాహిత్య సమ్మేళనం బెంగాల్ సాంస్కృతిక వారసత్వంలోనే కాకుండా, భారత సాంస్కృ తిక వారసత్వంలో కూడా ప్రముఖ స్థానం ఆక్ర మించింది. 

 సెల్: 9390509791


మరిన్ని వార్తలు