నా బలహీన సమయంలో ఓ డైరెక్టర్ లైంగికంగా వేధించాడు!

16-11-2026 | 05:15am

బాలీవుడ్ నటి స్వర భాస్కర్(Bollywood actress Swara Bhasker) తన కెరీర్ ప్రారంభ రోజుల్లో ఎదుర్కొన్న ఒక చేదు అనుభవాన్ని తాజాగా బయటపెట్టారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాలను పంచుకున్నారు. “2011లో ‘తను వెడ్స్ మను’ సినిమా విడుదలైన కొత్తలో, 20 ఏళ్ల వయసులో ఉన్న నాకు సొంతంగా పీఆర్ టీమ్ గానీ, ఇండస్ట్రీలో పరిచయాలు గానీ లేవు. ఆ సమయంలో నేను ఎవరి సహాయం తీసుకోలేని బలహీన స్థితిలో ఉన్నా.

మధ్యప్రదేశ్‌లోని పచ్మఢీలో 56 రోజుల పాటు జరిగిన అవుట్‌డోర్ షూటింగ్ షెడ్యూల్ ప్రారంభమైన కొద్ది రోజులకే వేధింపులు మొదలయ్యాయి. కెరీర్‌కు ఉపయోగపడే సినిమా కావడంతో, పని కోల్పోతాననే భయంతో ఆ 56 రోజుల పాటు మౌనంగా భరించాల్సి వచ్చింది. వేధింపులని అప్పుడు గుర్తించలేకపోయా. ఆ దర్శకుడు నన్ను భౌతికంగా తాకకపోవడం వల్ల, పని ప్రదేశంలో జరుగుతున్న.

ఆ ప్రవర్తనను లైంగిక వేధింపుగా నేను అప్పట్లో గుర్తించలేకపోయా. కొన్నేళ్ల తర్వాత ‘మీటూ’ ఉద్యమం మొదలై, మహిళల అనుభవాలు వెలుగులోకి వచ్చిన తర్వాతే నాకు జరిగింది కూడా లైంగిక వేధింపేనని అర్థమైంది. అయితే, ఆ క్లిష్ట సమయంలో సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నా పరిస్థితిని అర్థం చేసుకుని, షూటింగ్ పూర్తయ్యే వరకు నాకు అండగా నిలిచి రక్షణ కల్పించారు” స్వర భాస్కర్ వివరించారు. 


మరిన్ని వార్తలు