కల్యాణ్‌రామ్ సరసన..!
నందమూరి కల్యాణ్‌రామ్(Nandamuri Kalyan Ram) హీరోగా, పరశురామ్ దర్శకత్వంలో(Directed by Parasuram) తెరకెక్కనున్న కొత్త చిత్రంలో కథానాయికగా వామికా గబ్బి ఎంపికైనట్టు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని టాక్. విభిన్న కథా చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న కల్యాణ్‌రామ్, ఈ సినిమాతో మరోసారి కొత్త తరహా కథను ఎంచుకున్నట్టు సమాచారం.
‘గీత గోవిందం’, ‘సర్కారు వారి పాట’ వంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన పరశురామ్ ఈ ప్రాజెక్టును తెరకెక్కించనుండటం తో సినిమాపై ఆసక్తి నెలకొంది. ఇక వామికా గబ్బి ఎంపిక వార్తతో ఈ కాంబినేషన్‌పై మరింత ఆసక్తి పెరిగింది. తెలుగు, హిందీ, ఇతర భాషల్లో నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఆమెకు ఈ సినిమా టాలీవుడ్లో మరో మంచి అవకాశంగా నిలవనుంది.
అయితే హీరోయిన్ ఎంపికతో పాటు సినిమా కథ, ఇతర నటీనటులు, సాంకేతిక బృందం వివరాలపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.