రాజ్యంతోనే యుద్ధం.. రాముడితో కాదు!
కొణిదెల పవన్ తేజ్(Konidela Pawan Tej) హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘జంట’. ఈ చిత్రంలో పాడని కుమార్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని వసుంధర ఆర్ట్స్ బ్యానర్‌పై(Vasundhara Arts banner) రాజేశ్ గునిశెట్టి, వీరు యాదవ్ నిర్మిస్తున్నారు. రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఒక యూనిక్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా దర్శకుడు రాజశేఖర్ యాదవ్ తెరకెక్కిస్తున్నారు.
అరుణ్ పాండియన్, కల్పలత, నవీన్ నేని, అశోక్, శ్రావణ సంధ్య ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్ర టైటిల్, ఫస్ట్‌లుక్ లాంఛ్ ఈవెంట్ ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో పవన్ తేజ్ కొణిదెల మాట్లాడుతూ.. “రెండేళ్లుగా నేను, డైరెక్టర్ ఈ ప్రాజెక్ట్ మీద ప్రయాణిస్తున్నాం.
వేరే సినిమాల ఆఫర్లు వచ్చినా, నేను ఈ చిత్రం కోసం వేచిచూస్తూ వచ్చా. బలమైన కథతో ఈ సినిమా చేస్తున్నాం. ఇలాంటి కథ ఇప్పటిదాకా రాలేదు. ‘యుద్ధం రాముడితో కాదు రాజ్యంతో..’ అనేది మా సినిమా క్యాప్షన్. మా కథకు సరిపోయే క్యాప్షన్ ఇది” అన్నారు. హీరోయిన్ పాడని కుమార్ మాట్లాడుతూ.. “ఇది నాకు తొలి తెలుగు చిత్రం.
ఈ సినిమా షూట్లో జాయిన్ అయ్యేందుకు ఆత్రుతగా వేచిచూస్తున్నా” అని తెలిపింది. నిర్మాత రాజేశ్ గునిశెట్టి మాట్లాడుతూ.. “మా కంటెంట్‌కు తగినట్లు అమలాపురం లొకేషన్స్ సరిపోతాయనిపించి ఇక్కడికి వచ్చాం. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుంది. ఈ చిత్రానికి పనిచేసిన వాళ్లంతా గర్వపడతారు” అనిన చెప్పారు. ఇంకా ఈ వేడుకలో డీవోపీ రాహుల్ శ్రీ వాస్తవ్, ఫైట్ మాస్టర్ గౌరీ శంకర్ వీవీ కూడా మాట్లాడారు.