రోడ్డు ప్రమాదం.. వృద్ధుడు మృతి
16-11-2026 | 08:33pm
మల్యాల, నవంబర్ 16 (విజయక్రాంతి): మల్యాల, జగిత్యాల-కరీంనగర్ ప్రధాన రహదారిపై మల్యాల ఎక్స్‌రోడ్ సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదం(Road accident)లో మల్యాల మండలం మద్దుట్లకు చెందిన చుంచుల మల్లయ్య అనే వృద్ధుడు మృతిచెందాడు. రోడ్డు పక్కన బైక్ నిలిపి ఎదురుగా ఉన్న సూపర్ మార్కెట్‌కు వెళ్తుండగా కారు ఢీకొట్టింది. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.