జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సుర్పం అనిత
16-11-2026 | 08:35pm
ఆసిఫాబాద్ (విజయక్రాంతి):కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం మాలిని గ్రామానికి చెందిన సుర్పం అనిత జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా(District Women's Congress President) నియమితులయ్యారు. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రవెల్లి సువర్ణ ఈ నియామకాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన జాతీయ అధ్యక్షురాలు అలకా లాంబా, రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రవెల్లి సువర్ణ, మంత్రి జూపల్లి కృష్ణారావు, జాతీయ కార్యదర్శి బి. అదితకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో మహిళా కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.