అందరూ అభివృద్ధి కోసం కలిసికట్టుగా పని చేయాలి

16-11-2026 | 08:22pm

ఎమ్మెల్యే రాందాస్ నాయక్

త్వరలో పార్టీలో చేరతాను: తోటకూరి పిచ్చయ్య

కారేపల్లి, నవంబర్ 16, (విజయక్రాంతి): గ్రామాలలో రాజకీయాలకతీతంగా కలిసికట్టుగా పనిచేసి గ్రామాల అభివృద్ధి చేసుకోవాలని ఎమ్మెల్యే మాలోతు రామదాసు నాయక్(MLA Malothu Ramdas Naik), సుడా చైర్మన్ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ రావులు అన్నారు. సింగరేణి మండల పరిధిలోని గేటు కారేపల్లి గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు తోటకూర పిచ్చయ్య ఇంటికి సోమవారం తేనేటి విందుకు వచ్చినారు. వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాలలో ఎన్నికల సమయంలోనే రాజకీయాలు తర్వాత నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని, త్వరలో ఈ గేటు కారేపల్లికి చెందిన సీనియర్ జిల్లా నాయకులు తోటకూరి పిచ్చయ్య కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాబోతున్నారు.

అందుకు గేట్ కారేపల్లి పార్టీ నాయకులు కార్యకర్తలు మండల నాయకులు కార్యకర్తలు ఆయన సహాయ సహకారాలు తీసుకొని పార్టీ అభివృద్ధికి గ్రామం మండల అభివృద్ధికి కృషి చేయాలని పేర్కొన్నారు. త్వరలో చీమల వారి గుడెం వద్ద లిఫ్ట్ ఏర్పాటు చేసి ఆ లిఫ్ట్ ద్వారా మాదారం, రేగులగూడెం, గేటుగారేపల్లి, క మలాపురం గ్రామాల పరిధిలో ఉన్నటువంటి అన్ని చెరువులకి నీటి సౌకర్యం కలుగుతుంది ఆ నీటితో రైతులు పంటలు పండించుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశం కలుగుతుందని తెలిపారు. ఈ ప్రజా ప్రభుత్వం ప్రతి రైతు రాజు కావాలని ఆలోచనతో పనిచేస్తుంది అని తెలిపారు.

ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎవరు ఆరాటపడి గ్రామాలలో గొడవలు పెట్టుకోవద్దు . ఇందిరమ్మ ఇళ్ల పథకం నిరంతర ప్రక్రియ అర్హులైన అందరికీ తప్పక  ఇండ్లు వస్తాయి ఇంకా రెండు విడుదలలో ఇండ్లు వచ్చే అవకాశం ఉంది  మూడు, నాలుగు విడతలలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇండ్లు ఇస్తాము అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు ఇచ్చి ప్రజా ప్రభుత్వం ఎన్నికల టైం లో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని ఆయన తెలిపారు.

త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరుతాను: తోటకూరి పిచ్చయ్య

ప్రజా ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చూసి త్వరలో మండలంలో నా అనే వారి అందరిని సమీకరించి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతాను, ఎమ్మెల్యే మాలోతు రామదాసు నాయక్ సహాయ సహకారాలు తీసుకొని మా గ్రామం, మండలం, పార్టీ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు అందరూ హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో సింగరేణి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర రాంబాబు, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భానోత్ రామ్మూర్తి, సొసైటీ చైర్మన్ దుగ్గినేని శ్రీనివాసరావు, మాజీ ఎంపీపీలు పగడాల మంజుల, బానోతు దేవలనాయక్, మాలోత్ శకుంతల, సర్పంచులు పూసం ఎల్లయ్య, వీసం మోతి వీరస్వామి, భానోత్ హిరాలాల్, ఆంగోత్ మతృ, నాయకులు అడ్డగోడ ఐలయ్య, పెద్ద బోయిన ఉమా శంకర్, ఎండి అనీఫ్, గూగుల్లోతు భీముడు, మాలోతు కిషోర్, కడియాల సుధాకర్, సాయిన్ని తిరపతయ్య ,గుడిపూడి తిరుమలరావు, జక్కుల కుమార్, గుడిపూడి నరసయ్య, భూక్య చిట్టిబాబు,  గ్రామస్తులు, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు