విద్యార్థుల ఇబ్బందులకు పరిష్కారం
మునుగోడు,నవంబర్ 16 (విజయక్రాంతి): మునుగోడు మండలం కొంపల్లి గ్రామంలోని(Kompalli Village) జిల్లా పరిషత్ ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లో(Zilla Parishad High and Primary School) నిర్మించిన మరుగుదొడ్లను వెదిరె పూలమ్మ ఫౌండేషన్ వైస్ చైర్మన్ వెదిరె విజేందర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ జీడిమడ్ల నిర్మల దశరథతో కలిసి ప్రారంభించారు .
గ్రామంలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో సరైన మరుగుదొడ్లు లేక విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గత ఏడాది ఆగస్టు 15న అప్పటి మునుగోడు ఇన్చార్జి ఎంపీడీవో విజయభాస్కర్ దృష్టికి వెదిరె విజేందర్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తీసుకెళ్లారు. దీనిపై తక్షణమే స్పందించిన ఎంపీడీవో ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద రెండు యూనిట్లను మంజూరు చేశారు.
అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర విద్యా, సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగ విద్యార్థుల సౌకర్యార్థం మరో మరుగుదొడ్డిని మంజూరు చేయించారు. నిర్మాణాలు పూర్తయి ప్రారంభం కావడంతో గ్రామ పాలకవర్గ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు అప్పటి ఎంపీడీవో విజయభాస్కర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు గూడపూర్ వెంకట నారాయణ, గౌస్ బాబా, పాలకవర్గ సభ్యులు జీడిమడ్ల నరేష్, జాల నర్సింహ, జీడిమడ్ల మౌనిక, దాము కేతమ్మ, గోలి పార్వతి, పంచాయతీ కార్యదర్శి సురేష్, అమ్మ ఆదర్శ పాఠశాల మాజీ చైర్మన్ మొగుదాల శ్యామల, మండల కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి సంకు శంకర్, ఉపాధ్యాయ బృందం, జీడిమడ్ల దశరథ, దాము నర్సింహ, గోలి అనిల్, బోయపర్తి గణేష్ తదితరులు పాల్గొన్నారు.