మొదలైన ప్రత్యేక పిల్లల ప్రజావాణి

16-11-2026 | 08:27pm

నస్పూర్,( విజయక్రాంతి ): మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ లో(Mancherial District Collectorate) సోమ వారం సాధారణ ప్రజావాణితో పాటు ప్రత్యేకంగా ‘పిల్లల ప్రజావాణి’ని నిర్వహించారు. బాలలకు సంబంధించిన వ్యక్తిగత, సామాజిక సమస్యలు, ఇబ్బందులు, ఇతర ఫిర్యాదులు స్వీకరించగా, మొదటి రోజు నాలుగు ఫిర్యాదులు అందాయి.

ఇందులో లాస్యశ్రీ ఎంజేపీడబ్ల్యూఆర్ఐఆర్ఎస్ లో అడ్మీషన్ కోసం దరఖాస్తు చేసుకోగా సదరం సర్టిఫికెట్  కోసం శ్రీనీష్, ముత్యాల రిశ్వాన్ స్వీచ్ థెరఫీ కోసం, శ్రీనివాస్ ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నారు. కలెక్టర్ కుమార్ దీపక్ పిల్లల ప్రజావాణిలో దరఖాస్తులను డీడబ్ల్యూఓ రౌఫ్ ఖాన్, డీసీపీఓ ఆనంద్ లతో కలిసి తీసుకున్నారు.

మరిన్ని వార్తలు