ఎట్టకేలకు 165 సింగరేణి దుకాణాలపై ప్రత్యేక సర్వే

16-11-2026 | 08:21pm

బెల్లంపల్లి: ఎట్టకేలకు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మెయిన్ బజార్ లో(Bellampalli Main Bazaar) ఉన్న సింగరేణి దుకాణాలపై అధికారులు సర్వే చేపట్టారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, బెల్లంపల్లి పట్టణ పరిధిలో ఉన్న 165 సింగరేణి దుకాణాలు  రెవెన్యూ శాఖ ఆధీనంలో ఉన్నాయి. వాటిని బెల్లంపల్లి మున్సిపాలిటీకి అప్పగించే ప్రక్రియలో భాగంగా ప్రత్యేక సిబ్బందితో సమగ్ర సర్వే నిర్వహించారు

బెల్లంపల్లి తహసిల్దార్ లవుడియా కృష్ణ, బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్ ఈ సర్వేలో ప్రత్యక్షంగా ఉండి పర్యవేక్షించారు. ఈ 165 దుకాణాలను మున్సిపాలిటీకి ఆదాయాన్ని సమకూర్చగల విలువైన ఆస్తులుగా గుర్తించి,ఈ సర్వే చేపట్టారు. అయితే, సదరు దుకాణాలు ఇప్పటివరకు అధికారికంగా బెల్లంపల్లి మున్సిపాలిటీకి బదిలీ చేయనందునా, సర్వే ప్రక్రియ పూర్తి చేసి, అధికారికంగా మున్సిపాలిటీకి అప్పగిస్తారు. దీంతో వ్యాపారుల చిరకాల వాంఛ నిజం కానున్నది.

మరిన్ని వార్తలు