పట్టభద్రుల ఎమ్మెల్సీ సన్నాహక సమావేశాన్ని జయప్రదం చేయాలి

16-11-2026 | 08:29pm

టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కుందూరు దేవేందర్ రెడ్డి 

సూర్యాపేట, నవంబర్ 16 (విజయక్రాంతి) :ఈనెల 18వ తారీఖున సూర్యాపేటలో  ఎస్వీకే గ్రాండ్  హోటల్ లో(SVK Grand Hotel) జరిగే నల్లగొండ, ఖమ్మం, వరంగల్, పట్టభద్రుల ఎమ్మెల్సీ సన్నాహక సమావేశాన్ని జయప్రదం చేయాలని  సూర్యాపేట టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కుందూరు దేవేందర్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సమావేశానికి పట్టభద్రుల టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరమాస శ్రీకాంత్ గౌడ్ హాజరవుతున్నారని, అనంతరం జిల్లా గ్రంథాలయం లో పట్టభద్రులను, కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులను, వైద్యులతో కలిసి తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించనున్నారని తెలిపారు. ఈ సమావేశానికి పార్టీ శ్రేణులు,  అభిమానులు, పట్టభద్రులు, అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు