ఆశ్రమ పాఠశాలల్లో ఖాళీ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలి

16-11-2026 | 08:39pm

టీఏజీఎస్ జిల్లా కార్యదర్శి పోలం రాజేందర్

ప్రజావాణిలో అదనపు కలెక్టర్ కు వినతి

భూపాలపల్లి టౌన్, నవంబర్ 16 (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఆశ్రమ పాఠశాలల్లో విద్యా సంవత్సరం ప్రారంభమై ఆరు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు అనేక సబ్జెక్టులకు ఉపాధ్యాయులు లేకపోవడం బాధాకరమని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం(Telangana Adivasi Girijana Sangham) జయశంకర్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి పోలం రాజేందర్ అన్నారు. ఈ మేరకు ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ ఆశ్రమ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత కారణంగా విద్యార్థులకు కీలకమైన సబ్జెక్టుల్లో విద్యాబోధన జరగడం లేదని దాంతో విద్యార్థులు ఆయా సబ్జెక్టుల్లో వెనుకబడే ప్రమాదం ఉందని రాజేందర్ పేర్కొన్నారు. ఆదివాసీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కావున ఖాళీగా ఉన్న అన్ని ఉపాధ్యాయ పోస్టులను తక్షణమే భర్తీ చేసి ప్రతి సబ్జెక్టుకు పూర్తిస్థాయిలో విద్యాబోధన జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా కమిటీ సభ్యులు మేకల రాజు, శ్రీధర్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు