నీటి సంరక్షణ పరిశీలించిన కేంద్రకం సభ్యులు

16-11-2026 | 08:37pm

నిర్మల్ నవంబర్ 16 ( విజయ క్రాంతి): నేషనల్ వాటర్ అవార్డ్స్‌లో(National Water Awards) భాగంగా నిర్మల్ జిల్లాలో చేపట్టిన నీటి సంరక్షణ, జలవనరుల అభివృద్ధి పనులను పరిశీలించేందుకు సెంట్రల్ వాటర్ కమిషన్ సభ్యులు డి. గణేష్ సోమవారం జిల్లాలోని పలు గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా చిట్యాల, ముజ్గీ, దిలావర్‌పూర్, మాడేగం, పొన్కల్ గ్రామాలను సందర్శించి గ్రామాల్లో చేపట్టిన నీటి సంరక్షణ పనులు, వర్షపు నీటి నిల్వ, భూగర్భ జలాల పెంపునకు చేపట్టిన చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

గ్రామీణ ప్రాంతాల్లో నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడం, వర్షపు నీటిని ఒడిసిపట్టడం, భూగర్భ జలమట్టాలను పెంపొందించడం వంటి అంశాల్లో చేపట్టిన పనుల పురోగతిని పరిశీలించారు. నీటి వృథాను అరికట్టి, అందుబాటులో ఉన్న జలవనరులను భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడేలా సంరక్షించుకోవాల్సిన ఆవశ్యకతను ఈ సందర్భంగా వివరించారు. జిల్లాలో నీటి సంరక్షణ కోసం చేపడుతున్న కార్యక్రమాలు, గ్రామస్థాయిలో అమలు చేస్తున్న పనుల వివరాలను సంబంధిత అధికారులు కమిషన్ సభ్యులకు వివరించారు.

ఈ పర్యటనలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి విజయలక్ష్మి, ఎంపీడీఓలు, ఏపీఓలు, టెక్నికల్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులు, ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు