ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
- ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో నూతన చేయూత పెన్షన్ల మంజూరు పత్రాల పంపిణీ
- నాగిరెడ్డిపేట్ 480 కుటుంబాలకు సంక్షేమ భరోసా
నాగిరెడ్డిపేట్ నవంబర్ 16 (విజయ క్రాంతి):మండలంలోని అర్హులైన పేద కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల(government welfare schemes) ఫలాలు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్(MLA Madan Mohan) తెలిపారు. లింగంపేట్ పట్టణంలోని జీఎంఆర్ గార్డెన్స్‌లో ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నాగిరెడ్డిపేట్ మండల 480 కుటుంబాలకు నూతన పెన్షన్ లబ్ధిదారులకు చేయూత పెన్షన్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.
ఈ పెన్షన్ల ద్వారా ఒంటరి మహిళలు,వితంతువులు, దివ్యాంగులు,చేనేత కార్మికులు,గీత కార్మికులు, ఫైలేరియా బాధితులు తదితర అర్హులైన లబ్ధిదారుల కుటుంబాలకు ఆర్థిక భరోసా లభించనుంది.నాగిరెడ్డిపేట్ మండలంలో 480 కుటుంబాలకు పెన్షన్ ప్రయోజనం.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ..
అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు.పెన్షన్లు కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాకుండా,అర్హులైన కుటుంబాలకు ఆత్మగౌరవంతో జీవించేందుకు తోడ్పడే భరోసా అని పేర్కొన్నారు.నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రతి పేద కుటుంబ సంక్షేమానికి సమాన ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన కుటుంబాలకు మరింత చేయూత అందించేందుకు కృషి చేస్తామని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.