మళ్లీ తెరమీదకు ఈద్గా
- పర్యవరణ హితం కోసమే: మాజీ మేయర్ సింగ్
- అల్లర్లకు కుట్ర అంటున్న బీజేపీ
కరీంనగర్, నవంబర్ 15 (విజయక్రాంతి):కరీంనగర్ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్(Karimnagar One Town Police Station) సమీపంలోని ఈద్గా వద్ద మున్సిపల్ కార్పొరేషన్ అనుమతులు లేకుండా రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టడం వివాదానికి దారితీసింది.బీజేపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ‘ ఈ నిర్మాణాలు మతపరమైన ఉద్రిక్తతలకు,
అల్లర్లకు కుట్ర పన్నేలా ఉన్నాయని ఆరోపిస్తూ బీజేపీ కార్పొరేటర్లు నాయకులు జిల్లా కలెక్టర్‌కు, పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.* ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, అనధికార నిర్మాణాలకు బాధ్యులైన వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని బీజేపీ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి బోయినిపల్లి ప్రవీణ్ రావు, కార్పొరేటర్లు కోరారు.
ఇది ఇలా ఉండగా ఈద్గా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడానికి మొక్కలు నాటాలని నిర్ణయించామని, ఇక్కడ జనసంచారం ఎక్కువగా ఉంటుంది కనుక ఈద్గా పవిత్రత దెబ్బతినకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని బి ఆర్ ఎస్ నాయకుడు, మాజీ మేయర్ ప్రస్తుత కార్పొరేటర్ సర్ధార్ రవీందర్ సింగ్ స్పష్టం చేస్తున్నారు.
దీన్ని బి జె పి వారు కావాలని రాజకీయం చేస్తున్నారని ఆయన వాదన. గతంలో. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తన తొలి ఎన్నికల ప్రసంగంలో నడి రోడ్డుపై ఉన్న ఈద్గా వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని తొలగిస్తామని చేసిన ప్రసంగం అప్పట్లో వివాదంయింది రోడ్డు వెడల్పు సమయంలో అప్పటి కలెక్టర్ జరిపే ప్రయత్నాం చేయగా ఎం ఐ ఎం ఆందోళనకు దిగింది. తాజాగా కరీంనగర్లో ఈద్గా వద్ద జరుగుతున్న ఈ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.