శివాలయాలలో భక్తులు ప్రత్యేక పూజలు
ఎర్రుపాలెం నవంబర్ 16 (విజయ క్రాంతి): మండలంలోని శివాలయాలలో(Shiva temples) కార్తీక సోమవారం పురస్కరించుకొని భక్తులు ప్రత్యేక పూజ(Special Pujas) నిర్వహించారు. శివాలయాలలో కార్తీక మాసం సందర్భంగా భక్తులు తెల్లవారుజాము నుంచే శివాలయాలను దర్శించి విశేష అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు.
మండల కేంద్రంలోని వేంచేసిన శ్రీ బాల త్రిపుర సుందరి సహిత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానం నందు కార్తీక సోమవారం కావటంతో ఆలయ అర్చకులు నూరి గోపాలకృష్ణ శర్మ స్వామివారికి తెల్లవారుజామున నుండి రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు.
వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ హరిహర భేదం లేని పూజ ఈ కార్తీక మాసంలో శివుడిని, విష్ణువు ను ఇద్దరినీ సమానంగా పూజిస్తారని, విష్ణువు తులసిలో, శివుడు మారేడు( బిల్వ) వృక్షంలో నివసిస్తారని అన్నారు. సోమవారలు శివునికి అత్యంత ప్రీతికరమైన రోజులు అని, తెల్లవారుజామున నది స్నానాలు, కార్తీక పురాణ పఠనం, ఏకభుక్తం లేదా ఉపవాసాలు చేయడం వల్ల ఆ స్వామివారి ఆశీస్సులు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.