నల్లవాగు TSWRS/జేసీ హాస్టల్‌ లో హెల్త్ క్యాంప్

16-11-2026 | 08:46pm

సిర్గాపూర్ నవంబర్ 16(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల పరిధిలోని నల్లవాగు హాస్టల్‌ను(Nallavagu Hostel) డాక్టర్ నిఖిత సోమవారం హెల్త్ క్యాంప్(Health Camp) నిర్వహించారు. ఈ సందర్భంగా హాస్టల్‌లోని విద్యార్థులతో మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అందుతున్న వసతి సౌకర్యాలు, భోజనం, ఆరోగ్య పరిస్థితులు, పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించారు.

విద్యార్థుల సమస్యలను తెలుసుకుని, వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిన అవసరంపై సూచనలు చేశారు. విద్యార్థుల ఆరోగ్యం, విద్యాభివృద్ధికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.

మరిన్ని వార్తలు