కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరికి చేయూత

16-11-2026 | 08:43pm

- ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి

బిజినేపల్లి, నవంబర్ 16 : తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే చేయూత కలిగిందని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి(MLA Rajesh Reddy) అన్నారు. సోమవారం మండలంలోని ఆయా గ్రామాల లబ్ధిదారులకు చేయూత పింఛన్ల మంజూరి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా రాజేష్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ఎన్నికల కోసం హామీ ఇచ్చి అమలు చేయలేకపోయారని, ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి కాంగ్రెస్ ప్రభుత్వ ఫలాలు అందుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకులు మిద్దె రాములు, వాల్యా నాయక్, సర్పంచులు మిద్దె ఇందిర, నాగోలు నాగిరెడ్డి, పిట్టల జ్యోతి, అధికారులు, నాయకులు, చేయూత లబ్ధిదారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు