సినిమా షూటింగ్‌తో మందమర్రిలో ట్రాఫిక్ జామ్

16-11-2026 | 07:28pm

మందమర్రి, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా మందమర్రి(Mandamarri) పట్టణంలోని పాలచెట్టు ప్రాంతంలో సోమవారం సినిమా షూటింగ్ నిర్వహిస్తున్న క్రమంలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. షూటింగ్ నిర్వాహకులు రహదారిపై ట్రాఫిక్ రాకపోకలకు ఇబ్బందులు కలిగేలా చిత్రీకరణ చేపట్టడంతో వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోయాయి. దీంతో అటుగా ప్రయాణించే వాహనదారులు, మోడల్ స్కూల్ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సినిమా షూటింగ్ నిర్వహణ కోసం ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాల్సి ఉండగా, ట్రాఫిక్ అంతరాయం కలిగేలా షూటింగ్ నిర్వహించడంపై స్థానికులు అసహనం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు