జర్నలిస్ట్ ల సమస్యలపై వినతి
16-11-2026 | 07:07pm
మంచిర్యాల టౌన్, (విజయక్రాంతి) : జిల్లాలో వివిధ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలలో(Print and Electronic Media) పని చేస్తున్న విలేకరుల(Journalists ) సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమ వారం ప్రజావాణిలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రాములుకు వినతి పత్రం అందజేశారు.
జర్నలిస్ట్ ల సంక్షేమంపై ప్రభుత్వం దృష్టి సారించాలని, అలాగే రిటైర్డ్ జర్నలిస్ట్ లకు పెన్షన్ ఇవ్వాలని కోరారు. వినతి పత్రం అందజేసిన వారిలో చంద్రశేఖర్, సురేష్, రమేష్ రెడ్డి, రమేష్, వెంకట స్వామి, సంతోష్, అనీష్, ప్రభాకర్, శ్రీనివాస్, రాజేష్, తదితరులున్నారు.