యువ ఆపదమిత్ర కిట్ల పంపిణీ
16-11-2026 | 07:21pm
మంచిర్యాల క్రైమ్, (విజయక్రాంతి): మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల(Mancherial Government Degree College) NCC క్యాడెట్లకు సోమవారం యువ ఆపదమిత్ర కిట్లను అదిలాబాద్ బెటాలియన్ వారు పంపిణీ చేశారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన 18 మంది NCC క్యాడెట్లు యువ ఆపదమిత్ర కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని పూర్తి చేసినందుకుగాను మెటీరియల్ కిట్లను కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జై కిషన్ ఓజా సమక్షంలో విద్యార్థులకు అందజేసి క్యాడెట్ లను అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు Dr. T గంగయ్య, అధ్యాపక అధ్యాపకేతర బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.