దాబాల్లో దర్జాగా మందు సిట్టింగ్..
- కుర్తివాడ, ఏడుపాయల కమాన్ ఫుడ్ కోర్ట్ లో విచ్చలవిడిగా మద్యం సిట్టింగ్
- ప్రమాదాల బారిన పడుతున్న అమాయకులు
- అధికారులకు తెలిసే జరుగుతున్నా నిఘా కరువు
- అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై పలు విమర్శలు
పాపన్నపేట, నవంబర్ 15: పేరుకే దాబాలు(Dhabas), ఫుడ్ కోర్ట్ లు(Food courts).. నడిచేదంతా మందు సిట్టింగులు. మందు తాగడంపై నిషేధం ఉన్నా పాపన్నపేట మండలంలోని ఫుడ్ పోర్ట్ లలో(Food courts) సిట్టింగులు దర్జాగా సాగుతున్నాయి. దీంతో దాబాలు, ఫుడ్ కోర్ట్ లు మందు బాబులకు అడ్డాలుగా మారాయి. ఎలాంటి అనుమతు లు లేకుండా ఫుడ్ కోర్ట్ పేరుతో విచ్చలవిడి గా సిట్టింగులు నిర్వహిస్తున్నారు.
మద్యంకు నాన్ వెజ్ ఐటమ్స్, రోటి, రైస్ తయారు చేసి ఇవ్వడంతో అర్ధరాత్రి వరకు వ్యవహారం సాగుతో ంది. మద్యం సేవించి వాహనాలపై ఇళ్లకు వెళ్లే క్రమంలో ప్రమాదాల బారిన పడుతున్నారు. మద్యం బాబులు ప్రమాదానికి గురైందే కాకుండా ఎదురుగా వచ్చే అ మాయకులను సైతం ప్రమాదాల బారిన పడేస్తున్నారు.
అధికారుల నిఘా ఎక్కడ?
దాబా, ఫుడ్ కోర్టుల్లో నిబంధనలు అతిక్రమించి మద్యం సి ట్టింగులు నడిపిస్తున్నా సంబంధి త అధికారులు నిర్వాహకులపై చర్య లు తీసుకోకపోవడంపై విమర్శలకు తావిస్తోంది. విచ్చలవిడిగా సిట్టింగ్ వ్యవహారంపై అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
చర్యలు తీసుకోకపోవడంపై అసలు కారణాలేంటి?
పట్టపగలు, ఆరుబయట టేబుల్ వేసి మరీ మద్యం తాగేందుకు అనుమతిస్తున్నా సంబంధిత శాఖ అధికారులు దాబా, ఫుడ్ కోర్ట్ నిర్వాహకులపై చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు రేకెత్తుతున్నాయి. అధికారు లు, నిర్వాహకుల మధ్య ఏదైనా ఒప్పందం ఉందేమోనని విమర్శలు వ్యక్తం అవుతున్నా యి. రాత్రి వేళల్లో తనిఖీలు నిర్వహిస్తే వాస్త వ పరిస్థితులు వెలుగులోకి వస్తాయని ప్రజ లు పేర్కొంటున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేయాలని కోరుతున్నారు.
అధికారులు స్పందిస్తారా అన్నది వేచి చూడాల్సిందే
దాబా, ఫుడ్ కోర్టుల్లో సిట్టింగ్ కొనసాగుతోందన్న ఆరోపణలపై అధికారులు స్పందిస్తారా? ఆకస్మిక తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటారా? అన్నది వేచి చూడాల్సిందే. ఈ విషయమై ఎక్సైజ్ శాఖ సీఐ వెంకటేష్, డీటీఎఫ్ సీఐ గోపాల్ ను ఫోనులో సంప్రదించగా సమాధానం ఇవ్వలేదు.