నూతన పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ

16-11-2026 | 07:26pm

ఇందిరమ్మ ఇంటి ప్రారంభోత్సవం...

శివంపేట్ నవంబర్ 16 ( విజయక్రాంతి ):నర్సాపూర్ నియోజకవర్గంలో(Narsapur Constituency) ప్రజా సంక్షేమం, గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా మెదక్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి(Minister Gaddam Vivek Venkatswamy) నర్సాపూర్ పట్టణంలోని శ్రీ సాయికృష్ణ గార్డెన్స్‌లో నిర్వహించిన కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా శివంపేట మండల PACS చైర్మన్ చింతల వెంకట్రాంరెడ్డి మంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డి చేతుల మీదుగా నూతనంగా మంజూరైన పింఛన్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. అనంతరం శివంపేట మండలం దంతాన్‌పల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని PACS చైర్మన్ చింతల వెంకట్రాంరెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడంతో పాటు, పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమానికి, గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.

మరిన్ని వార్తలు