నిబంధనలకు ‘నీళ్లు’
- వేస్ట్ వాటర్‌ను బయటకు వదిలేస్తున్న వివాల బేవరేజ్ కంపెనీ
- రోడ్డుకు ఇరువైపులా కిలోమీటర్ మేర పారుతున్న నీరు
- పట్టించుకోని అధికారులు
మేడ్చల్, నవంబర్ 15 (విజయక్రాంతి): ఎల్ నినో ప్రభావంతో(El Niño effect) కరువు పరిస్థితులు ఏర్పడిన దృష్ట్యా నీటిని పొదుపుగా వాడుకోవాలని ఒకవైపు ప్రభుత్వం విస్తృత ప్రచారం(Widespread publicity) చేస్తుంటే, మరోవైపు జిల్లాలో కొన్ని కంపెనీలు వేస్ట్ వాటర్‌ను (Companies' wastewater) వృధాగా పారిస్తున్న ప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు. వేస్ట్ వాటర్‌ను పునర్వినియోగానికి చర్యలు తీసుకోవలసి ఉండగా తమకెందుకులే అని ఊ రుకుంటున్నారు.
జిల్లాలోని ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని రాజ బొల్లారం శివారులో ఇవాల బేవరేజ్ కంపెనీ ఆర్ ఓ ప్లాంట్ నుంచి వచ్చే వేస్ట్ వాటర్ ను బయటకు వదిలేస్తోంది. దీంతో ఆ నీరు రోడ్డుకు ఇరువైపులా పారుతోంది. కొన్నేళ్లుగా ఇలాగే వదిలేస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం విస్మయం కలిగిస్తోంది. ఈ కం పెనీలోని నీరు బెయిలి వాటర్ పేరుతో మార్కెట్లో విక్రయిస్తున్నారు.
ప్రతిరోజు వేల బాటిల్ల నీరు ఇక్కడ ఉత్పత్తి చేస్తున్నారు. అంతకంటే ఎక్కువ వేస్ట్ వాటర్ బయటకు వదిలేస్తున్నారు. వేస్ట్ వాటర్ ను మురుగు కాలువలు, రోడ్ల మీదకు వదలకూడదని నిబంధనలు ఉన్నాయి.
మురుగు కాలువల్లోకి, రోడ్లమీదకు వదిలేస్తే మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలి. కానీ అనేక ఏళ్లుగా ఈ కంపెనీ వేస్ట్ వాటర్ ను బయటకు వదిలేస్తున్నప్పటికీ చర్యలు తీసుకోవడం లేదు. పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థ జలాల పునర్వినియోగం విషయములో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు చర్యలు తీసుకోవాలి. వారు కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
ప్లాంటు నిర్వాహకుల ఇష్టారాజ్యం..
వేస్ట్ వాటర్ బయటకు వెళ్లకుండా ప్లాం ట్ నిర్వాహకులు తగిన చర్యలు తీసుకోవాలి. కానీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అంతేగాక ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా రు. అధికారులకు మామూళ్ళు ఇచ్చి మేనేజ్ చేస్తున్నారు. వేస్ట్ వాటర్ ను నేరుగా డ్రైనేజీలోకి వదలకుండా, ప్లాంట్ ఆవరణలో లో తైన ఇంకుడు గుంతలు నిర్మించి అందులోకి మళ్ళించాలి. దీనివల్ల బోరు బావిలో నీటిమ ట్టం ఎప్పటికీ తగ్గకుండా ఉంటుంది. ఫిల్రేషన్ పద్ధతి ద్వారా వేస్ట్ వాటర్ శుద్ధి చేసి నేరుగా వాడుకలో లేని బావుల్లోకి మళ్ళి ఇస్తే భూగర్భజలాలు పెరిగే అవకాశం ఉంది.
భవన, రోడ్ల నిర్మాణాలకు సరఫరా చేయాలి..
భవన, రోడ్ల నిర్మాణాలకు వేస్ట్ వాటర్ వినియోగించుకోవడానికి అవకాశం ఉం టుంది. కంపెనీలో పెద్ద సంపులో లేదా ఓవ ర్ హెడ్ ట్యాంక్‌లో వేస్ట్ వాటర్ నిల్వ చేస్తే బిల్డర్లు, ఇతర అవసరాలకు కావలసినవారు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. నీటిని బయటకు వదిలేస్తున్న కంపెనీ పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.