మోసపోయాం జానకి..!
సాయి సోహన్, విస్మయశ్రీ, విష్ణు ఓయ్, నరేంద్ర రవి, హరితేజ, జీవన్‌కుమార్, మురళీధర్‌గౌడ్ ప్రధాన పాత్రల్లో నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్(Nisa Entertainments), సెవెన్ క్రియేషన్స్ బ్యానర్లు(Seven Creations Banners) ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రాన్ని డిఫరెంట్ క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు మధుసూధన్ రెడ్డి గోపు రూపొందిస్తున్నారు. వచ్చే ఏడాది థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న.
ఈ సినిమా మేకర్స్ ఆదివారం ప్రకటించారు. ఈ చిత్రానికి ‘మోసపోయాం జానకి’ అనే టైటిల్ ఖరారు చేశారు. ముగ్గురు యువకులు డబ్బు సంచులతో అంబాసిడర్ కారు దగ్గరకు నడుచుకుంటూ వెళ్తున్న స్టిల్‌తో డిజైన్ చేసిన టైటిల్ అనౌన్స్‌మెంట్ పోస్టర్ ఆసక్తి కలిగిస్తోంది.
ప్రభుత్వం ఇప్పటికే రద్దు చేసిన కరెన్సీ నోట్లు కొన్ని వీరి సంచుల నుంచి కిందపడటం పోస్టర్‌లో రివీల్ చేయడం ద్వారా అంచనాలు పెంచేశారు. ఈ చిత్రానికి డీవోపీ: మహిరెడ్డి పండుగుల; సంగీతం: సురేశ్ బొబ్బిలి; లిరిక్స్: కాసర్ల శ్యామ్, పూర్ణాచారి, సురేశ్ గంగుల; ఎడిటర్: రవితేజ గిరిజాల; ఆర్ట్: తెనేటి విజయ్ చిన్న.