పటిష్టమైన స్క్రీన్‌ప్లేతో ఛప్రి

16-11-2026 | 05:15am

సరోజ్ కుమార్(Saroj Kumar) హీరోగా రూపొందుతున్న కొత్త సినిమా ‘ఛప్రి’(movie ‘Chhapri’). ఈ చిత్రానికి స్టోరీ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, లిరిక్స్, ఎడిటింగ్, మ్యూజిక్, దర్శకత్వ బాధ్యతల్ని సరోజ్ నిర్వర్తించారు. బీఎస్‌కే మెయిన్ స్ట్రీమ్ బ్యానర్‌పై సరోజ్, ప్రమోద్ పడమటి, పృథ్వీ చౌహాన్ నిర్మించారు. ఐశ్వర్య బోరా, దివ్య జ్యోతి, శ్లోకా, ప్రవీణ్, మోహన్ ఆర్య, జీవా బాలచందర్, ప్రియాంక సింగ్ కీలక పాత్రలను పోషించారు.

ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో కథానాయకుడు సరోజ్ కుమార్ మాట్లాడుతూ.. “ఛప్రి’ సినిమాను వేసవిలో రిలీజ్ చేయాలనుకున్నాం. ఫిబ్రవరిలో టీజర్ ప్లాన్ చేశాం. కానీ జూనియర్ ఆర్టిస్ట్ లీక్ చేశాడు. నేను ఎంతో ట్రామాను అనుభవించా. అందుకే టీజర్‌ను ఇంత త్వరగా వదిలాం. ఇండస్ట్రీలో, సెట్‌లో మాకు సెక్యూరిటీ లేదు. 700 రోజులు కష్టపడి రాసిన కథ ఇది.

రివ్యూయర్లను కూడా దృష్టిలో పెట్టుకుని పటిష్టమైన స్క్రీన్‌ప్లే రాసుకున్నా. ఈ సినిమాతో మేమేంటో అందరికీ తెలుస్తుంది” అన్నారు. ఇంకా ఈ వేడుకలో సినిమాటోగ్రాఫర్ రమేశ్ మర్రెపల్లి, కాస్ట్యూమ్ డిజైనర్ అజయ్ సాయి, నటీనటులు ప్రవీణ్, దివ్య జ్యోతి, జీవా, ప్రమోద్ పడమటి, ఐశ్వర్య కూడా మాట్లాడారు. 

మరిన్ని వార్తలు