మనీలాలో మోదీ సందడి
మనీల (ఫిలిప్పీన్స్): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Narendra Modi) ఫిలిప్పీన్స్ పర్యటనలో భాగంగా సోమవారం ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మనీలాలోని ఫిలిప్పీన్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో ఆ దేశ అధ్యక్షుడు ఫెర్డినాండ్ ఆర్.మార్కోస్(Philippine President Ferdinand R. Marcos) ఏర్పాటు చేసిన గాలా డిన్నర్‌కు హాజరయ్యారు. 49వ ఆసియాన్ సదస్సు(49th ASEAN Summit), దానికి అనుబంధంగా జరుగుతున్న సమావేశాలకు హాజరైన వివిధ దేశాల అధినేతలు, ప్రముఖులకు స్వాగతం పలికేందుకు ఈ విందును ఏర్పాటు చేశారు. 'నావిగేటింగ్ ది ఫ్యూచర్' (Navigating the Future) అనే ఇతివృత్తంతో ఈ సదస్సు కొనసాగుతోంది.
మోదీ ఈ పర్యటనలో భాగంగా 23వ ఆసియాన్-భారత్ సదస్సు(23rd ASEAN-India Summit), 21వ తూర్పు ఆసియా సదస్సులో పాల్గొననున్నారు. వాణిజ్యం, సముద్ర భద్రత, ప్రాంతీయ అనుసంధానం, ఆర్థిక సహకారం వంటి కీలక అంశాలపై ఆయా దేశాల నేతలతో చర్చలు జరపనున్నారు. భారత్ అనుసరిస్తున్న 'యాక్ట్ ఈస్ట్' విధానంలో ఆసియాన్ దేశాలతో సంబంధాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈ పర్యటనతో భారత్-ఫిలిప్పీన్స్ ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సహకారం మరింత బలోపేతం కానుందని భావిస్తున్నారు.