ఇంటింటికీ 100 శాతం చెత్త సేకరణ
- వ్యర్థాలను రోడ్లపై పోస్తే బిల్డర్లకు జరిమానాలు
- ఎలక్ట్రిక్ వాహనాలకే మొగ్గు.. బల్క్ వేస్ట్ జనరేటర్లపై నిఘా
- అధికారులతో కమిషనర్ సృజన సుదీర్ఘ సమీక్ష
- ఏప్రిల్ 1నుంచి కొత్త నిబంధనలు
హైదరాబాద్ సిటీ బ్యూరో మార్చి, 24 (విజయక్రాంతి):సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పారిశుధ్య వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసేందుకు ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి రానున్న కొత్త మున్సిపల్ ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధ నలను కచ్చితంగా అమలు చేయాలని కమి షనర్ సృజన అధికారులను ఆదేశించారు. మంగళవారం నాక్ ఆడిటోరియంలో ఐఏఎ ల్‌ఏ కమిషనర్లు, జోనల్ కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ విభాగాల ఉన్నతాధి కారులతో నిర్వహించిన సమీక్షా సమావే శంలో ఆమె పాల్గొని దిశానిర్దేశం చేశారు.
పారిశుధ్య సేవలలో జవాబుదారీతనం లేకుంటే సహిం చేది లేదని, ప్రతి పనిలోనూ పారదర్శకత ఉండాలని ఆమె స్పష్టం చేశారు. నగర పరి శుభ్రతలో పౌరుల భాగస్వామ్యం అత్యంత కీలకమని కమిషనర్ సృజన పేర్కొన్నారు. అన్ని ప్రాంతాల్లో 100 శాతం ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించాలని, ముఖ్యంగా తడి, పొడి చెత్తను ఇళ్ల వద్దే వేరు చేసేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని అధికారులను ఆదే శించారు.
ఐటీ కారిడార్‌తో పాటు పెరుగుతు న్న నిర్మాణ రంగం దృష్ట్యా.. భవన నిర్మాణ వ్యర్థాల నిర్వహణపై కమిషనర్ ప్రత్యేక దృష్టి సారించారు. రోడ్ల పక్కన, ఖాళీ స్థలాల్లో ఇష్టానుసారంగా నిర్మాణ వ్యర్థాలను పారవే సే బిల్డర్లు, ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. నిర్మాణదారులు నిబంధనల ను 100 శాతం పాటించేలా నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
చెత్త నిర్వహ ణలో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, క్షేత్రస్థాయిలో అమలు చేయాలని చెత్త సేకరణలో సంప్రదాయ వాహనాల కంటే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి మొగ్గు చూపాలని సూచించారు. మార్గదర్శ కాలకు అనుగుణంగా సిబ్బందిని, వ్యవస్థల ను అప్డేట్ చేయాలని, దీనికి సంబంధించిన ప్రామాణిక నిర్వహణ విధానాలను త్వరలో నే విడుదల చేస్తామని కమిషనర్ సృజన వెల్లడించారు. నగర పరిశుభ్రతను కాపాడ టంలో అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు.




