calender_icon.png 12 September, 2025 | 3:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

1800 599 5991 ఇందిరమ్మ ఇండ్ల సమస్యల పరిష్కారానికి హెల్ప్‌లైన్

12-09-2025 01:07:16 AM

ఆవిష్కరించిన రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

హైదరాబాద్, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి): ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల సమస్యలు, సందేహాల నివృత్తి కోసం హైదరాబాద్‌లోని హౌసింగ్ కార్పొరేషన్ కార్యాల యంలో టోల్ ఫ్రీ కాల్ సెంటర్‌ను, హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేశారు. ఈ మేరకు కాల్ సెంటర్ నంబర్ 1800 599 5991ను మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం కొంతమంది లబ్ధిదారుల కు ఫోన్ చేసిన మంత్రి, ఇందిరమ్మ ఇంటి బిల్లలుపై ఆరా తీశారు.

కాల్ సెంటర్ రోజూ ఉదయం 7 నుంచి రాత్రి 9 వరకు పనిచేస్తోందని.. ప్రధానంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించడంతోపాటు, వాటిని పరిష్కరించడంలో చొరవ చూపడానికి ఈ కాల్ సెంటర్‌ను వినియోగించుకోవచ్చని మంత్రి పేర్కొన్నారు.

లబ్ధిదారుల ఫోన్ నెంబర్, ఆధార్ నెంబర్ ఆధారంగా వివరాలను పరిశీలించి సమస్యను పరిష్కరించడానికి అధికారులు చర్యలు తీసుకుంటారని నిర్ణీత గడువులోగా బిల్లులు జమ కాకపోవడం, ఎక్కడైనా ఎవరైనా సిబ్బంది చేయడం, ఫొటోలను అప్‌లోడ్ చేయడంలో ఆలస్యం చేయడం, ఇతర సాంకేతిక సమస్యలు, అవినీతి ఆరోపణలు తదితర అంశాలపై ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించి, వాటిని సంబంధిత అధికారుల వద్దకు తీసుకెళ్లి చర్యలు తీసుకొని లబ్ధిదారులకు కూడా ఆ వివరాలను తెలియచేస్తారని పొంగులేటి వివరించారు. 

బీసీల కులగణనలో రోల్ మోడల్..

స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనలో తెలంగాణ రాష్ర్టం దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. గురువారం మంత్రుల నివాస సముదాయంలోని తన నివాసంలో ఈ నెల 15న కామారెడ్డిలో నిర్వహించే బహిరంగ సభ ఏర్పాట్లపై మంత్రులు సీతక్క, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, వివేక్ వెంకటస్వామి లతో కలిసి సమీక్షించారు.