calender_icon.png 17 January, 2026 | 7:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

52 మంది మావోయిస్టుల లొంగుబాటు

17-01-2026 04:06:03 AM

  1.   49 మంది తలలపై రూ.1.41 కోట్ల రివార్డు
  2. లొంగిపోయిన వారిలో 21 మంది మహిళలు
  3. వివరాలు వెల్లడించిన బీజూపూర్ ఎస్పీ జితేంద్రకుమార్ 

చర్ల /రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో గురువారం ౫౨ మంది మావోయిస్టులు లొంగిపోయారు. భద్రతా దళాల కూంబింగ్, ప్రభుత్వం అమలు చేస్తున్న పునరావాస పథకాల ప్రభావంతో ఈ పరిణామం చోటుచేసుకున్నది. ఎస్పీ డాక్టర్ జితేంద్రకుమార్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. లొంగిపోయిన 52 మందిలో 21 మంది మహిళా మావోయిస్టులు ఉన్నారు. మొత్తంగా 49 మందిపై రూ.1.41 కోట్ల రివార్డు ఉంది. లొంగిపోయిన వారిలో పార్టీ డివిజనల్ కమిటీ సభ్యుడు లక్కు కరమ్ అలియాస్ అనిల్, ప్లాటూన్ పార్టీ కమిటీ సభ్యురాలు లక్ష్మీ మాధవి వంటి కీలక నేతలు ఉన్నారు.

వీరంతా దండకారణ్యం, ఆంధ్రా -ఒడిశా సరిహద్దు, మహారాష్ట్రలోని భమ్రాగఢ్ ప్రాంతాల్లో పార్టీ కోసం క్రియాశీలంగా పనిచేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ‘పునా మార్గెం’ (కొత్త ఉదయం) పునరావాస పథకం పట్ల ఆకర్షితులై వీరు హింసా మార్గాన్ని వీడారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం నుంచి తక్షణ సాయంగా రూ.50,000 చొప్పున ఆర్థిక సాయం అందింది.