calender_icon.png 28 July, 2025 | 5:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగోలో 21 మంది కాల్చివేత

28-07-2025 01:46:45 AM

రెచ్చిపోయిన తిరుగుబాటుదారులు

రిపబ్లిక్ ఆఫ్ కాంగో, జూలై 27: తూర్పు కాంగో కోమాండాలోని ఓ చర్చి ప్రాంగణంలో ఇస్లామిక్ స్టేట్ మద్దతు కలిగిన తిరుగుబాటుదారు లు రెచ్చిపోయారు. అలైడ్ డెమోక్రటిక్ ఫోర్సెస్(ఏడీఎఫ్)కు చెందిన సా యుధ తిరుగుబాటుదారులు దాడు లు చేసి 21 మంది ప్రాణాలు బలిగొన్నారు. ఏడీఎఫ్ సభ్యుల కాల్పుల్లో ఇండ్లు, దుకాణాలు కూడా దహనం అయ్యాయి. సాయుధ తిరుగుబాటుదారుల దురాగతాన్ని ఓ సామాజిక కార్యకర్త మీడియాకు తెలపగా.. కాం గో సైనిక ప్రతినిధి కూడా ధ్రువీకరించారు. కేవలం పది మంది మాత్రమే మరణించినట్టు వెల్లడించారు.