28-07-2025 01:48:52 AM
మహారాష్ట్ర మాజీ మంత్రి అల్లుడితో సహా పలువురి అరెస్ట్
పుణె, జూలై 27: పుణె నగరంలోని ఓ అపార్ట్‌మెంట్‌పై పోలీసులు ఆదివారం తెల్లవారుజామున దాడి చేశారు. ఈ సందర్భంగా నార్కొటిక్స్, హుక్కా సెటప్‌తో పాటు లిక్కర్‌ను సీజ్ చేసి.. ఏడుగురిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో మహారాష్ట్ర మాజీ మంత్రి ఏక్‌నాథ్ ఖడ్సే అల్లుడు ప్రాంజల్ ఖేవాల్కర్ ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు.
ఈ ఏడుగురు నిందితులను కోర్టులో హాజరుపర్చగా.. కోర్టు వారికి ఈ నెల 29 వరకు పోలీస్ కస్టడీ విధించింది. ఈ ఆంశంపై మహారాష్ట్రలో రాజకీయ రగడ మొదలైంది. ప్రాంజల్ ఖేవాల్కర్ భార్య రోహిణి ఖడ్సే(ఎన్సీపీ ఎస్పీ) మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్నారు.