16-06-2025 10:50:13 PM
రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖమంత్రి కొండా సురేఖ..
హనుమకొండ (విజయక్రాంతి): పేదవారి ఆత్మగౌరవ ప్రతిక సొంత ఇల్లు అని వారి కళలను సహకారం చేయడానికి ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతుందని రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) అన్నారు. సోమవారం వరంగల్ ఓ సిటీలోని మంత్రి క్యాంపు కార్యాలయం ఆవరణలో వరంగల్ తూర్పు నియోజకవర్గ లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేసి, కార్యక్రమంలో మంత్రి సురేఖ ముఖ్యఅతిథిగా నగర మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర్ రావులతో కలిసి లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజు పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ... వరంగల్ నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా, అందులో 1659 ఇండ్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేయడం జరిగిందని మిగిలిన అర్హులైన లబ్ధిదారులకు వెరిఫికేషన్ పూర్తయిన వెంటనే మంజూరు పత్రాలు అందజేయడం జరుగుతుందని అన్నారు. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి రావు మాట్లాడుతూ.. తూర్పు నియోజకవర్గంలో ప్రతి పేదవానికి ఇల్లు మంజూరు అయ్యేలా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, కార్పొరేటర్లు వస్కుల బాబు, సోమిశెట్టి ప్రవీణ్, పల్లం పద్మ, ముష్కమల్ల అరుణ, చింతాకుల అనిల్ కుమార్, భోగి సువర్ణ సురేష్, పోశాల పద్మ, కావేటి కవిత, భైరబోయిన ఉమా దామోదర్ యాదవ్, గుండు చందన పూర్ణచందర్, ఓని స్వర్ణలత, పురుకాన్, బాల్నే సురేష్, బసవరాజ్ కుమారస్వామి, సురేష్ జోషి, ఇందిరమ్మ ఇళ్ల నోడల్ అధికారి రామ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ ప్రసన్న రాణి, ఆర్డీవో సత్యపాల్ రెడ్డి, రెవెన్యూ, హౌసింగ్, మెప్మా, బల్దియా, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.