calender_icon.png 31 July, 2025 | 9:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సరైన మార్గదర్శనం కూడా సామాజిక సేవే

31-07-2025 01:38:42 AM

- సమాజంలో ఒంటరిగా అభివృద్ధి చెందలేం

- సమష్టిగా అడుగు ముందుకెళ్తేనే సానుకూల ఫలితం

- రాష్ర్ట ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు 

హైదరాబాద్/శేరిలింగంపల్లి, జూలై 30(విజయక్రాంతి) : సామాజిక సేవ అంటే కేవలం ఆర్థిక సాయం చేయడమే కాదు. మన చుట్టూ ఉండే వారి అవసరాలను అర్థం చేసుకోవడం, వారికి మద్దతు ఇవ్వడం, సరైన మార్గదర్శనం చేయడం ద్వారా వారి జీవితాల్లో సానుకూల మార్పును తీసుకురావడం” అని రాష్ర్ట ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. మానవ జీవితంలో సమాజమే కీలకమని, ఒంటరిగా కాకుండా సామూహికంగానే అభివృద్ధి చెందగలమన్నారు.

బుధవారం గౌలి దొడ్డిలోని బ్రాహ్మణ సదనంలో సెంటర్ ఫర్ బ్రాహ్మిణ్ ఎక్స్‌లెన్స్ (సీబీఈ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. “సమాజానికి మనం ఎంత ఇస్తే, అది అంతకు రెట్టింపు తిరిగి ఇస్తుంది. అది ధనం రూపంలో కాకపోయినా, ఆత్మ సంతృప్తి రూపంలో, ఆశీ ర్వాదాల రూపంలో తిరిగి వస్తుంది. ప్రజల మధ్యకు వెళ్లి, వారి సమస్యలను తెలుసుకొని పరిష్కరించడం నాకు ఎల్లప్పుడూ సంతృప్తినిచ్చే అంశం” అని చెప్పారు. ఒక్కరిగా మన మేం సాధించలేమని... అదే సమష్టిగా అడు గు ముందుకేస్తే అసాధ్యం అంటూ ఏదీ ఉం డదన్నారు.

వర్తమానంలో సమాజం పట్ల మన బాధ్యతలు ఏమిటి, భవిష్యత్తుకు ఎలా మార్గదర్శనం చేయగలమో తెలుసుకొని ఆ దిశగా పని చేయాల్సిన అవసరం మనందరిపై ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ విషయంలో కొందరూ కావాలనే దుష్ర్పచారం చేస్తున్నారని... ఈ సంస్థ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇప్పటికే రూ.25 కోట్లు కేటాయించామని... రాబోయే రోజు ల్లో మరిన్ని నిధులు ఇస్తామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని స్పష్టం చేశారు. విద్యా, ఉపాధి రంగంలో బ్రాహ్మణ యువతను అత్యున్నత స్థాయికి చేరేలా మార్గ నిర్దేశం చేస్తున్న సీబీఈ సేవలు స్ఫూర్తిదాయకమన్నారు.

ఈ సంస్థ ద్వారా సమాజం కోసం తమ వంతుగా పాటు పడుతున్న రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్, ఉన్నతాధికారులు, ఇతర నిపు ణుల కృషి అనిర్వచనీయమని కొనియాడారు. ఈ సంస్థ అభివృద్ధికి ప్రభుత్వం తర ఫున అన్ని రకాలుగా అండగా ఉంటామని తెలిపారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ సహకారంతో ఈ సంస్థ ద్వారా నైపుణ్య శిక్షణా కార్యక్రమాలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.

సీబీఈ ద్వారా సివిల్స్ కోసం సిద్ధమవుతున్న అయి దు మంది అభ్యర్థుల బాధ్యతను స్వీకరించేందుకు ముందుకొచ్చిన ప్రణీత్ కన్ స్ట్రక్షన్స్ అధినేత నరేందర్‌ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని మరికొందరూ ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు వాణీ దేవి, పురాణం సతీష్ కుమార్, వాలంటే టెక్నాలజీస్ సీఈవో, కో ఫౌండర్ విజయ్ వొద్దిరాజు, ఓబుల్ రెడ్డి పబ్లిక్ స్కూల్ ఛైర్మన్ ఎస్ రావు, వేణుగోపాల చారి, ఎల్వీ సుబ్రహ్మణ్యం, ఐవైఆర్ కృష్ణారావు, జ్వాలా నర్సింహరావు తదితరులు పాల్గొన్నారు.