calender_icon.png 1 July, 2025 | 8:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సారు రారు.. తాళం తీయరు..

01-07-2025 02:12:28 AM

-ఉపాధ్యాయుడు లేక విద్యకు దూరమవుతున్న పిల్లలు

-పాఠశాలల పునఃప్రారంభం నుంచి తెరుచుకొని సర్కారు బడి 

బోథ్, జూన్ 30 (విజయ క్రాంతి): ప్రతిరోజు ఉదయం విద్యార్థులు పాఠశాలకు రావాలి... సర్కారు బడికి  ఉన్న తాళం చూసి తిరిగి ఇంటిముఖం మట్టాలి... పాఠశాలలు పునఃప్రారంభమై నెల రోజులు కావస్తున్న ఆ ప్రభుత్వ పాఠశాల ఇప్పటికీ తేర్చుకోలేదంటే అధికారుల నిర్లక్ష్యం కొట్టచ్చినట్లు కనబడుతోంది. దీంతో విద్యార్థులు విద్యకు దూరమ వుతున్న ఘటన. ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. నూతనంగా ఏర్పడిన సొనాల మండలంలోని మారుమూల ఆదివాసి గిరిజన గ్రామమైన మహదు గూడ లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఇంకా తేర్చుకోలేదు.

పాఠశాలకు కేటాయించిన ఉపాధ్యా యుడు రాక విద్యార్థులు పాఠశాలకు వచ్చి ఇంటికి తిరుగు ముఖం పడుతున్నారు. కొందరు విద్యార్థులు మాత్రం కొద్దిసేపు పాఠశాల వరండాలోనే కూర్చొని పుస్తకాల ను తెరిచి చదువుకోవడం జరుగుతోంది. పాఠశాలలు పునఃప్రారంభం అయినప్పటి నుండి ఉపాధ్యాయులు ఎవరు బడికి రావ డం లేదని విద్యార్థులు పాఠశాలకు వచ్చి తా ళం చూసి ఇంటికి వెళ్ళిపోతున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. ఈ పాఠశాలలో పని చేస్తున్న ఒకే ఒక్క టీచర్ సైతం లాంగ్ లీవ్ లో ఉన్నాడని, ఎవరు కూడా పట్టించు కోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. 

అధికారుల నిర్లక్ష్యానికి ఆదివాసీ గిరిజన బిడ్డలు విద్యకు దూరమవ్వాల్సిందేనా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఆదివాసీ విద్యార్థుల పట్ల ఎందుకీ నిర్లక్ష్యం అని నిలదీస్తున్నా రు. పాఠశాలలో 20 మంది విద్యార్థులు ఉన్నారని వారి భవిష్యత్తు ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. సంబంధిత  మండలం విద్యాధికా రి కల్పించుకొని వెంటనే పాఠశాలకు ఉపాధ్యాయున్ని కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు