calender_icon.png 24 August, 2025 | 6:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భావోద్వేగాలతో కట్టిపడేసే బ్యూటీ

24-08-2025 01:28:18 AM

అంకిత్ కొయ్య, నీలఖి జంటగా నటిస్తున్న చిత్రం ‘బ్యూటీ’. దీన్ని ‘గీతా సుబ్రమణ్యం, ‘హలో వరల్డ్’, ‘భలే ఉన్నాడే’ చిత్రాల ఫేమ్ జేఎస్‌ఎస్ వర్ధన్ తెరకెక్కిస్తున్నారు. వానరా సెల్యూలాయిడ్, మారుతీ టీమ్ ప్రొడక్ట్, జీ స్టూడియోస్ సంయుక్తంగా రూపొందిస్తున్న ఈ చిత్రానికి అడిదాల విజయపాల్ రెడ్డి, ఉమేశ్‌కుమార్ బన్సా  ల్ నిర్మాతలు. ఇప్పటికే ఈ చిత్రం పోస్టర్లు, గ్లింప్స్, పాటలు ప్రేక్షకాదరణ పొం దాయి. తాజాగా మేకర్స్ ఈ మూవీ టీజర్‌ను విడుదల చేశారు.

టీజర్ చూస్తే.. మంచి యూత్ ఫుల్ లవ్‌స్టోరీకి, ఫాదర్ ఎమోషన్, మిడిల్ క్లాస్ టచ్ ఇస్తే ఎలా ఉంటుందో ‘బ్యూటీ’ సినిమా చూపించబోతోందనిపిస్తోంది. విజయ్ బుల్గానిన్ ఆర్‌ఆర్ కదిలించేలా ఉంది. శ్రీసాయికుమార్ దారా ఇచ్చిన విజువల్స్ సినిమా పేరుకు తగ్గట్టే బ్యూటీఫుల్‌గా ఉన్నాయి. ఈ చిత్రంలో నరేశ్, వాసుకి, నందగోపాల్, సోనియా చౌదరి, నితిన్ ప్రసన్న, మురళీగౌడ్, ప్రసాద్ బెహరా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సెప్టెంబర్ 19న విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: విజయ్ బుల్గానిన్; డీవోపీ: శ్రీసాయి కుమార్ దారా; ఎడిటర్: ఎస్‌బీ ఉద్ధవ్; ఆర్ట్: బేబీ సురేశ్ భీమగాని; నిర్మాతలు: అడిదాల విజయపాల్‌రెడ్డి, ఉమేశ్‌కుమార్ బన్సాల్; కథ, స్క్రీన్‌ప్లే: ఆర్‌వీ సుబ్రహ్మణ్యం; మాటలు, దర్శకత్వం: జేఎస్‌ఎస్ వర్ధన్.