24-08-2025 01:34:21 AM
యువ హీరో సుధీర్‌బాబు, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ ‘జటాధర’. ఈ పాన్-ఇండియా ద్విభాషా చిత్రానికి వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఉమేశ్‌కుమార్ బన్సాల్, ప్రెర్ణా అరోరా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భారీ స్థాయి విజువల్స్, పౌరాణిక ఇతివృత్తాలతో ఈ చిత్రం ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ అనుభూతిని ఇవ్వ నుంది. ఈ సినిమా నుంచి ఇటీవల రిలీజ్ అయిన టీజర్ నెట్టింట వైరల్ అయింది. తాజాగా మేకర్స్ ఈ సినిమాలో నటిస్తున్న నటి దివ్య ఖోస్లా పాత్రను సితారగా పరిచ యం చేశారు. పోస్టర్‌లో బ్యూటీఫుల్‌గా, క్లాసిక్‌గా దివ్య ఖోస్లా ఫస్ట్‌లుక్ అదిరిపోయింది.