calender_icon.png 29 May, 2025 | 1:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ రిజర్వేషన్ల అమలుకు జీవో తేవాలి

28-05-2025 12:23:04 AM

  1. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై అన్ని పార్టీలు తమ విధానాన్ని ప్రకటించాలి
  2. బీసీ రిజర్వేషన్ల పెంపుపై ప్రభుత్వం నుంచి ఇప్పటికీ స్పష్టత లేదు
  3. నిరాశతో వెయ్యిమంది బీసీలు ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధం
  4. రాష్ట్ర బంద్‌కు కూడా వెనుకాడబోమని హెచ్చరిక
  5. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య

ముషీరాబాద్, మే 27 (విజయక్రాంతి) : రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తూ జీవో తేవాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో సం ఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీలం వెంకటేశ్ ముదిరాజ్ అధ్యక్షతన జరిగిన సమా వేశంలో ఆయన మాట్లాడారు.

ముందుగా అన్ని రాజకీయ పార్టీలు బీసీ రిజర్వేషన్ల పెంపుపై తమ విధానాన్ని ప్రకటించాలని కోరారు. ఈ సందర్భంగా ఎంపీ ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 20 నుంచి 42 శాతానికి బీసీ రిజర్వేషన్లు పెంచుతూ అసెంబ్లీలో చట్టం చేసిందన్నారు. కానీ ఆ తర్వాత దానిని కేంద్రానికి పంపుతామని సీఎం ప్రకటించారని, తర్వా త దానిపై అతీగతీ లేదని విమర్శించారు.

ఇప్పటివరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై ప్రభు త్వం నుంచి స్పష్టత లేదన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243-డీ6 ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని పేర్కొ న్నారు. ఒకవేళ ఎవరైనా సుప్రీం కోర్టుకెళ్లినా బీసీ జనాభా లెక్కలు చూపి, కేసు గెలిచే అవకాశం ఉందన్నారు. ఉమ్మడి ఏపీ నుంచి ఏ ముఖ్య మంత్రి కూడా బీసీ వ్యతిరేక విధానాలు తీసుకోలేదన్నారు.

ప్రస్తుతం సిఎం రేవంత్ రెడ్డి కూడా ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42శాతం రిజర్వేషన్లు పెం చాని డిమాండ్ చేశారు. నిరాశతో వెయ్యి మంది బీసీలు ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. రాష్ట్ర బంద్‌కు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు.

ఈ సమావేశంలో బీసీ సంఘం నేతలు జి.అనం తయ్య, శ్రీనివాస్‌చారి, మణికంఠ, మోదీ రాందేవ్, పగిళ్ల సతీష్, చిక్కుడు బాలయ్య, శివ ముదిరాజ్, పీ.కాశయ్య గౌడ్, చందు గౌడ్, చంద్రశేఖర్, రాజు నేత, టీ.నర్సింహా తదితరులు పాల్గొన్నారు.