28-05-2025 12:25:48 AM
అధిక ధరలకు విక్రయిస్తున్న పూజ సామాగ్రి
చిన్న చింతకుంట, మే 27 : పల్లె ప్రజల ఆరాధ్య దైవంగా కొలవబడుతూ పేదల తి రుపతిగా పేరుగాంచిన శ్రీ కురుమతి కొండ స్వామి పుణ్యక్షేత్రానికి భక్తులు భారీగా తరలివచ్చారు. మంగళవారం అమావాస్య కావ డంతో జిల్లా నలుమూలల నుంచే కాకుండా పల్లె ప్రాంతాల నుంచి ఆటోలు, ద్విచక్ర వా హనాలు, కాలినడకన స్వామి కొండకు ఉదయాన్నే చేరుకున్నారు.
కొండ దిగువన స్వా మివారి పుష్కరిణి లో పుణ్య స్థానాల ఆచరించి స్వామివారి ప్రధాన మెట్ల గుండా క్యూ లైన్లలో బారులు తీరి స్వామి వారి ప్రధానాలయంలో కొలువైన శ్రీ కురుమూర్తి స్వామి ని దర్శనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో భక్తులు గోవిందా..
గోవిందా కురుమూర్తి వాసా గోవిందా నామస్మరణలతో కురుమతిగిరులు పులకరించాయి. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఉద్దాల మండపంలోని స్వామివారిని పాదుకలను తాకి భక్తులు పునీతులయ్యారు.
అధిక ధరలకు టెంకాయ.. భక్తుల అసహనం
కొండ దిగువన టెంకాయల విక్రయ కేం ద్రం వద్ద భక్తులకు 25 రూపాయల కు టెంకాయ, ఊది బత్తీలు, కుంకుమ కలిపి ఇ వ్వాలి కానీ గుత్తేదారు 30 రూపాయలకు ఒక టెంకాయ మాత్రమే ఇస్తూ భక్తులను దోపిడీ చేస్తున్నారు.
ప్రతి అమావాస్యకు ఇలా అధిక ధరలకు అమ్ముతున్న దేవస్థాన అధికారులు మాత్రం పట్టించుకోలేదని భక్తుల నుంచి విమర్శలువెల్లువెత్తుతున్నాయి.దేవాదాయ ,ధర్మాదాయ శాఖ నిర్ణయించిన ధరలకు ఒక్క టెంకాయ 25 రూపాయలకు విక్రయించేలా దేవస్థాన అధికారులు చూడాలని భక్తులు కోరుతున్నారు.