09-12-2025 02:20:40 AM
ఆటోలో తిరుగుతూ ప్రచారంలో సర్పంచ్ అభ్యర్థి
మహబూబాబాద్, డిసెంబర్ 8 (విజయక్రాంతి): పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఓ అభ్యర్థి ప్రమాదంలో కాలికి కదలలేని స్థితిలో ఉన్నప్పటికీ ప్రచారం చేయక తప్పడం లేదు. కాలి నొప్పితో గాయపడుతున్న ఆయన ప్రచారం కోసం గ్రామంలో తిరగడానికి ప్రత్యేకంగా ఒక ఆటో మాట్లాడుకున్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కోరుకొండపల్లిలో యాసాడి బాలాజీరెడ్డి సర్పంచ్‌గా పోటీ చేస్తున్నారు.
ఆ యన అంతకుముందే రోడ్డు ప్రమాదంలో కాలికి గాయమై ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నాడు. తన పరిస్థితి బాగాలేదని ఎన్నికల్లో సర్పంచుగా పోటీ చేయడానికి నిరాకరించగా, కార్యకర్తలు నాయకుల బలవంతం మీద చివరకు ఎన్నికల బరిలో నిలిచాడు. ఆటోలో వీధి వీధినా తిరుగుతూ తన కు కేటాయించిన బ్యాట్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలంటూ ఆటోలో నుం డే ఓటర్లను వేడుకుంటున్నాడు.