05-12-2025 12:25:04 AM
జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్
ములుగు,డిసెంబర్4(విజయక్రాంతి):ఉమ్మడిఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా,తమిళనాడు,కర్ణాటక రాష్ట్రాల గవర్నర్ గా పనిచేసిన కొణిజేటి రోశయ్య అందించిన సేవలు చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్. అన్నారు గురువారం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కొణిజేటి రోశయ్య వర్ధంతి కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ అదనపు కలెక్టర్లు సిహెచ్ మహేందర్ జి,సంపత్ రావు,ఇతర అధికారులతో కలిసి హాజరై రోశయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక మంత్రిగా ఎన్నో సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారని,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పని చేసి రాష్ట్రాన్ని వినూత్న సంస్కరణలతో అభివృద్ధి చేశారని తెలిపారు అనంతరం తమిళనాడు,కర్ణాటక రాష్ట్రాల గవర్నర్ గా పని చేసి విశిష్ట సేవలు అందించారని తెలిపారు. రాజకీయాలలో స్వచ్ఛమైన వ్యక్తిగా గుర్తింపు పొందారని,రోశయ్య వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు. మహనీయుల ఆశయాలను సాధించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని తెలిపారు.