14-03-2025 12:18:02 AM
మహేశ్వరం, మార్చి 13 (విజయక్రాంతి): కిరాణా దుకాణం ముందు కుర్చీలు వేసుకొని కూర్చోవడం వల్ల వ్యాపారం దెబ్బతింటుందని మందలిం చిన ఓ వృద్ధుడిపై ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా దాడి చేశారు.ఈ దాడిలో వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందా డు. ఈ సంఘటన కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
గురువా రం ఇన్స్‌స్పెక్టర్ శేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పాతబస్తీ హఫిజ్‌బాబానగర్‌కు చెందిన జకీర్‌ఖాన్ (53), స్థానికంగా కిరాణా దుకాణం నిర్వహిస్తున్నాడు. కిరాణా దుకా ణం పక్కనే అజీం, పహీం అనే ఇద్దరు వ్యక్తు లు పాన్‌షాపును నడిపిస్తున్నారు.
గురువా రం ఉదయం అజీం, పహీం స్నేహితులు పాన్‌షాపు వద్దకు రావడంతో వీరు కిరాణా దుకాణం ముందు కుర్చీలు వేసి స్నేహితుల తో మాట్లాడుతుండగా మీరు దుకాణం ముందు కూర్చోవడం వల్ల నా వ్యాపారం దెబ్బతింటుంది షాపు ముందు నుంచి పక్క కు వెళ్లండి అంటూ జకీర్ ఖాన్ అక్కడ వేసిన కూర్చీలను తీసివేసే ప్రయత్నం చేశాడు. దీంతో కొపోద్రిక్తులైన అజీం, పహీం ఇద్దరు జకీర్‌ఖాన్‌పై దాడి చేశారు. ఈ దాడిలో ముఖంపై ఛాతిపై తీవ్రమైన గాయాలు అయ్యాయి.
పిడి గుద్దులకు జకీర్‌ఖాన్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని వైద్యశాలకు తరలించారు. జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసి కంచన్‌బాగ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.