calender_icon.png 27 August, 2025 | 12:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగ్గురు హిజ్రాల అరెస్ట్

14-03-2025 12:16:34 AM

డబ్బులు డిమాండ్ చేస్తే ఇవ్వకపోవడంతో దాడికి పాల్పడ్డ హిజ్రాలు

శేరిలింగంపల్లి, మార్చి 13 (విజయక్రాం తి): మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 100 ఫీట్ రోడ్ పక్కన గల తాజా కిచెన్ రెస్టారెంట్‌లో ఈ నెల 4వ తేదీన సాయంత్రం 4:30గంటల ప్రాంతంలో ముగ్గురు హిజ్రా లు తాజా కిచెన్ వద్దకు వెళ్ళి హోలీ సందర్భంగా తాజా కిచెన్ ఓనర్ అయినటువంటి రాఘవేందర్ రావును రూ.2000 డిమాండ్ చేశారు.

అందుకు రాఘవేందర్ రావు నిరాకరించగా ముగ్గురు హిజ్రాలు పక్కనే ఉన్న ఐరన్ డస్ట్‌బిన్‌ను రాఘవేందర్‌రావు వైపు విసిరివేశారు. ఈ ఘటనలో రాఘవేందర్‌రావు ముక్కుకు తగిలి తీవ్ర రక్తస్రావం కాగా వెంటనే చికిత్స నిమిత్తం హైటెక్ సిటీలోని యశోద హాస్పిటల్‌కు తరలించారు.

ఈ విషయంపై పోలీసు వారికి అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి గురువారం ముగ్గురు హిజ్రాలు అర్జు అలియాస్ షేక్ హుసైన్, ఆధాఖాన్ అలియాస్ అబ్దుల్ సాదిక్ అబ్దుల్ రఫిక్, నేహా అలియాస్ నీలేష్ ఆనంద్ కాడేలను రిమాండ్‌కు తరలించారు.