26-01-2026 02:45:40 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, జనవరి 25: హైదరాబాద్ నగరంలోని మర్కాజ్, ఘో డ్ కీ కబర్ ప్రాంతంలో ఉన్న 2 బెడ్రూ మ్ డిగ్నిటీ హోమ్స్లో క్రికెట్ మ్యాచ్ను ఘనం గా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆళ్ల పురుషోత్తం రావు , అధ్యక్షుడు లక్ష్మణ్ గారితో కలిసి క్రికెట్ మ్యాచ్ను ప్రారంభించి క్రీడాకారులను ఉత్సాహపరిచారు.ఈ సందర్భంగా ఆళ్ల పురు షోత్తం రావు మాట్లాడుతూ, యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవడం ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం కూడా పొందుతారని అన్నారు.
ఇలాంటి క్రీడా కార్యక్రమాలు యువతలో క్రమశిక్షణ, జట్టు భావనను పెంపొందిస్తాయని పేర్కొన్నారు.అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లా డుతూ, నివాస ప్రాంతాల్లో ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహించడం వల్ల యువతను చెడు అలవాట్లకు దూరంగా ఉంచవచ్చని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తామని ఆయన హామీ ఇచ్చారు.