calender_icon.png 4 August, 2025 | 6:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అరవై ఏళ్ల వయసులోనూ స్వర్ణ పతకాల పంట

04-08-2025 12:00:00 AM

  1. పరుగు పందెంలో రెండు గోల్డ్  మెడల్స్ 

రాష్ట్రస్థాయి పోటీలో సత్తా చాటిన రవీందర్

మణుగూరు, ఆగస్టు 3,  (విజయక్రాంతి) : అరవై ఏళ్ల వయసులోనూ తగ్గేదేలే అంటూ పివి కాలనీ కి చెందిన ఓ చిరువ్యాపారి జల్లా రవీందర్ ఆదివారం హైదరాబాద్ లోని జింఖానా స్టేడియంలో జరిగిన లాంగ్ జంప్ ,100 మీటర్ల రాష్ట్రస్థాయి  పరుగుపందెం లో పాల్గొని రెండు బంగారు పతకాలు సాధించి  రికార్డు సృష్టించారు. ఆ వయసులో కూడా రన్నింగ్ రేసులో పాల్గొని రవీందర్ అందరినీ ఆశ్చర్యపరిచి, తోటి వారిని అబ్బురపరుస్తూ  స్వర్ణ పతాకాలను సాధించారు.

ఈ సందర్భంగా ఆయన హైదరాబాదు నుండివిజయక్రాంతి తో ప్రత్యేకం గా ముచ్చటించారు. 2015 నుండి ఇప్పటి వరకు జిల్లా, రాష్ట్రస్థాయి లో జరిగిన పరుగుపందేలు, లాంగ్జంప్ పోటీలలో పాల్గొన్న ప్రతిసారి  విజేతగా నిలిచి 40 కి పైగా రజిత, కాంస్య, వివిధ పతకాలను సాధించానని తెలిపారు. ఈసారి రాష్ట్ర స్థాయిలో రెండు స్వర్ణ పతకాలు సాధించడం ఆనందంగాఉందన్నారు.

భద్రాద్రి స్టేడియం లో  రోజు వారిగా తాను చేసే ప్రాక్టీస్ తోనే పతకాలను దక్కించు కోవడం జరిగిందన్నారు. ఇలాంటి పోటీల్లో పాల్గొని విజేతగా నిల వాలంటే, శారీరక దృఢత్వం తో పాటు, విజయమే లక్ష్యంగా ఫిట్‌గా ఉండాలని యువతకు సూచించారు. గ్రామీణ స్థాయి నుంచి వచ్చే యువతీ, యువకులు ఎక్కువగా క్రీడల్లో రాణిస్తున్నారని, వారిని ప్రభుత్వం మరింతగా ప్రోత్సహించాలని కోరారు. 

 క్రీడా కారులు రాష్ట్ర, జాతీయ స్థాయి లో రాణించేలా లక్ష్యం పెట్టుకుని కృషి చేయాలని, అప్పుడేఅనుకున్నది సాధించగలమన్నా రు.  స్వర్ణలతో  మణుగూరు సత్తాను రాష్ట్రస్థాయిలో చాటి అద్భుతం సృష్టించిన  రవీందర్ ను పలువురు అభినందించారు.