calender_icon.png 4 August, 2025 | 3:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెద్దాస్పత్రికి ఆదివారం సెలవా..?

04-08-2025 12:00:00 AM

- మూసి ఉన్న బెల్లంపల్లి పెద్ద ఆసుపత్రి                

-ఇంటికెళ్లిన నర్సులు, వైద్యులు.. 

-వైద్యం కోసం వచ్చిన తిరిగి వెళ్లిన రోగులు.. 

--ఇన్ పేషెంట్లు, అవుట్ పేషంట్‌లు ఆగ్రహం

-వైద్యో నారాయణ అంటే ఇదేనా..? అంటున్న రోగులు 

బెల్లంపల్లి అర్బన్, ఆగస్టు 3 : బెల్లంపల్లి ప్రభుత్వ పెద్ద ఆస్పత్రికి తాళం పడింది. ఆది వారం అత్యవసర వైద్య సేవలు, ఇన్ పేషం ట్ల కోసం వైద్యులు, వైద్య సిబ్బంది విధుల్లో ఉండాలి. కానీ ఆదివారం అని వీకెండ్ సెల వు తీసుకున్నట్టుగా ఆస్పత్రి మూసి ఉంది. ఆస్పత్రిని మూసి వేసి వైద్యులు నర్సులు వెళ్లిపోయారు.

మధ్యాహ్నం నాలుగు దాటిన వైద్య సిబ్బంది ఎవరు ఆస్పత్రికి రాలేదు. ఆసుపత్రి మూసి ఉండడంతో వైద్యం కోసం వచ్చిన రోగులు తిరిగి వెళ్లారు. మరికొందరు వచ్చి అక్కడే వైద్యుల కోసం పడి కాపులు కాసిన పరిస్థితి నెలకొంది. ఉదయం విధులకు హాజరైన వైద్యులు, వైద్య సిబ్బంది 12  తర్వాత వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆసుపత్రి ప్రధాన ద్వారం తలుపులు మూసి ఉన్నాయి. అత్యవసర విభాగం ఆసుపత్రి మూసి ఉండ డం ఒకింత అధ్యంతం ఆశ్చర్యాన్నీ  కలిగిస్తోంది.

ఆస్పత్రి ప్రధాన ద్వారం మూసి ఉండగా వెనక వైపు ఒక డోర్ మాత్రమే ఓపె న్ చేసి ఉంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రభుత్వ వైద్యశాల మూసి ఉండకూడదు. అత్యవసర వైద్య సేవలకు ఆస్పత్రి ఎల్లవేళల ఓపెన్ గానే ఉండాలి. అంతకు భిన్నంగా ప్రధాన ఆసుపత్రి మూసి వేసి ఉండడం ఏం టన్నది అంతు చిక్కడం లేదు. వైద్యులు, నర్సులు అత్యవసర సేవలను విస్మరించి, ఇన్ పేషెంట్ల  పర్యవేక్షణను సైతం గాలికి వదిలేసి వెళ్లిపోయారు.

ఆసుపత్రి మూసి ఉంచడంపై ఇన్ పేషెంట్లు, అవుట్ పేషంట్ లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూసి ఉన్న సమయంలో వైద్యం కోసం అత్యవసర పరిస్థితుల్లో ఎవరైనా పేషంట్లూ వస్తే వారి పరిస్థితి ఏంటన్నది ఆందోళన రేకెత్తించే విషయం. వైద్యో నారాయణ అంటే ఇదేనా? అని వైద్యుల తీరును పలువురు ప్రశ్నిస్తున్నారు. కాగా బాధ్యత రాహిత్యంగా ప్రభుత్వ వైద్య సిబ్బంది ఆస్పత్రిని మూసివేసి బయటికి వెళ్లడంపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.