calender_icon.png 21 November, 2025 | 2:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొక్కజొన్న సాగువైపు రైతన్న చూపు

21-11-2025 12:05:21 AM

  1. మండలంలో 450 నుంచి 500 ఎకరాల సాగు అంచనా

కంతనపల్లి,ముప్పనపల్లి గ్రామాలలో ఎక్కవ సాగు విస్తీర్ణం

రైతులకు పలు మార్లు సలహా ఇస్తున్న వ్యవసాయ శాఖ అధికారులు

అగ్రిమెంట్ లేకుండా విత్తనోత్పత్తి మొక్కజొన్న వేసుకోవద్దు

కన్నాయిగూడెం వ్యవసాయ అధికారి కుంజ మహేష్

కన్నాయిగూడెం,నవంబరు20(విజయక్రాంతి):ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో ఈ సంవత్సరం మళ్ళీ మొక్కజొన్న ఏజెంట్స్ గ్రామాలలో తిరిగి విత్తనం మొక్కజొన్న వేపించటానికి ముందుగా కొంత పెట్టుబడికి అని రైతులకు 20000 నుండి 30000 వరకు రైతులకు ఇచ్చి రైతులను వారి రైతులుగా నమోదు చేసుకుంటు న్నారు,

గత సంవత్సరాం కొందరు ఏజెంట్స్ రైతులకు డబ్బులు ఇవ్వకుండా కంపిని నుం డి వారికీ రావలిసిన డబ్బులు తీసుకొని రైతులను చాలా ఇబంది పెట్టారు మళ్ళీ ఈ సంవత్సరాం మళ్ళీ విత్తనాల ఏజెంట్స్ గ్రా మాలలో తిరుగుతున్నారు అని మాకు తెలుస్తుంది, ఈ సంవత్సరాం వర్షాలు ఎక్కువ పడటం వలన పెసర,ప్రత్తి ఆశించినంత దిగుబడులు రాకపోవటం వలన విత్తనం మొక్క జొన్న వేసుకొని ఎక్కువ దిగుబడి సాదించాలి అని కొందరు రైతులు ఆలోచి స్తున్నారు,

అదే ఆసరాగా భావించి అమాయక రైతులకు ఎక్కువ దిగుబడి వస్తాయి మా కంపినీ మొక్కజొన్న విత్తనాలు వేసుకుంటే అని మరియు పురుగు మందులు మేమే ఇస్తాము, పెట్టబడి మేమే ఇస్తాము అని రైతులకు ఆశ చూపి విత్తన మొక్కజొన్న వేపిస్తారు, మాములు మొక్కజొన్నతో పోలి స్తే విత్తనం మొక్కజొన్నకు పెట్టుబడి ఎక్కువ మరియు రైతులకు ఇచ్చే పురుగు మందులు మన దెగ్గర కాకుండా ఎక్కడ నుండో తీసుకొని వస్తారు చిన్న చిన్న కంపినీలవి మరియు బయో పురుగు మందులు ఇచ్చే అవి 2000 అయితే 5000 అని చెపుతారు బిల్స్ కూడా కొంత మంది రైతులకు ఇవ్వరు,

ఇలా రైతును వితనాలు ఇచ్చిన దెగ్గర నుండి చివరి వరకు అన్ని ఎక్కువ ధరలు రాసి మొత్తం మొక్కజొన్న కోసిన తరువాత 5 నుండి 10 క్వింటాల్ వస్తే రైతుకు ఏమి మిగులు తుంది, గత సంవత్సరాం కంటే ఈ యేసంగికి ఇంకా ఎక్కువ విత్తన మొక్కజొన్న వేపించటానికి లోకల్ ఏజెంట్స్ కాకుండ బయట ఆంధ్ర వాళ్ళు కూడా వచ్చి గ్రామాలలో తిరుగు తున్నారు.

వాళ్ళు ఎవరో ఏం టో తెలియకుండా గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ తెలిసిన వాడా కదా ఆలోచించ కుండా కొందరు అమాయక రైతులు వారి ప్రలోభాలకు లొంగి విత్తన మొక్కజొన్న వెయ్యటానికి రడీగా , గత సంవత్సర అన్ని విత్తన కంపినిస్ వారు టార్గెట్ కంటే ఎక్కువ విత్తన మొక్కజొన్న వెయ్యటం వలన వారి గోదాంమ్ లు కూడా నిండి పోయాయి అని అన్నారు,

మళ్ళీ రైతులు విత్తన మొక్కజొన్న వేస్తే కంపిణీలు తీసుకుంటుందా లేదా మాకు సంబంధం లేదు అంటే ఇక్కడ వున్న ఏజెంట్స్ చేసేది ఏమి లేక రైతులకు డబ్బు లు ఇచ్చే పరిస్థితి ఉండదు ఎలా కూడా రైతు లు నష్ట పోతారు, విత్తన మొక్కజొన్న వేసిన రైతు పొలానికి 500 మీటర్స్ వరకు నాటు మొక్కజొన్న వెయ్యకూడదు ఎవరు అయినా వేస్తే ఇద్దరు రైతుల మొక్కజొన్న దిగుబడులు తగ్గుతాయి అన్న విషయం కొందరు మొక్కజొన్న ఏజెంట్స్ కు ఈ విషయం కూడా తెలి యదు,

కొందరు రైతులు అనుభవం వున్న ఏజెంట్స్ నా మరియు మొక్కజొన్న పంట కోత తరువాత వారం రోజులలో డబ్బులు ఇచ్చే వారా అని కూడా తెలుసుకోకుండా విత్తనం మొక్కజొన్న వేస్తున్నారు, మళ్ళీ కొం దరు ఏజెంట్స్ రైతు దెగ్గర మాత్రం అగ్రిమెం ట్ తీసుకుంటారు ఏమని అంటే నువ్వు పం డించిన మొక్కజొన్న నాకే ఇవ్వాలి నాకు కా కుండా వేరే వారికీ ఇస్తే చట్ట పరంగా మీ మీ ద పిర్యాదు చేస్తాము అని అదే విదంగా రై తుకు కూడా నాకు నష్టం వస్తే కంపెనీ నాకు నష్ట పరిహారం ఇవ్వాలి అని రైతుకి కూడా అగ్రిమెంట్ ఇవ్వాలి కానీ రైతు దెగ్గర అగ్రిమెంట్ తీసుకుంటారు కానీ రైతుకు ఇవ్వటం లేదు రైతుకి కూడా అభయం ఇవ్వాలిగా ఆలా ఇవ్వకుండా తక్కువ దిగుబడి వస్తే రైతుని పటించుకొక పోవటం రైతు నష్ట పోతున్నారు,

కొందరు ఏజెంట్స్ మొక్కజొన్న కోత తరువాత 10 రోజులలో వారికి డబ్బులు ఇవ్వాలి కానీ నెలలు నెలలు వారిని తిప్పుకొని డబ్బులు ఇచ్చారు, రైతులకు వ్యవసాయ శాఖ నుండి ఒకటే విన్నపము అగ్రిమెంట్ ఇస్తే విత్తనం మొక్కజొన్న వేసుకోండి లేదా నాటు మొక్కజొన్న వేసుకోండి 

 ఏజెంట్స్ పాటించు వలిసిన నియమాలు

1) ఏజెంట్ తప్పకుండా లోకల్ వారు అయి ఉండాలి

2) విత్తనాలు వేసే టప్పుడు మీ కంపినీ సిబంది దెగ్గర ఉండి విత్తనాలు వేపించాలి

3) వారానికి ఒకసారి రైతు పొలం దెగ్గరకు వెళ్లి సలహాలు చూచనలు ఇవ్వాలి 

4) పొలం లో ఏమయినా సస్య రక్షణ చర్యలు తీసుకోవాలి అంటే రైతుకి వెంటనే చెప్పి చేఇంచాలి 

5) డీ టాసాలింగ్ సమయాణికు చేపించాలి,లేకపోతే దిగుబడులు సగానికి సగం తగ్గుతాయి, రైతు నష్ట పోతారు 

6) రైతులకు ఇచ్చే కలుపు మందులు పురుగు మందులు తప్పకుండా లోకల్ వున్న పురుగుమందుల షాప్ ల వద్ద మాత్రమే తీసుకోవాలి లేదా మీరే పురుమందుల      లైసెన్స్ తీసుకొని రైతులకు ఇవ్వవచ్చు 

7)రైతుల నుండి మీరు అగ్రిమెంట్ ఎలా తీసుకుంటున్నారో అలాగే రైతుకి కూడా తప్పకుండా అగ్రిమెంట్ ఇవ్వాలి 

8) వ్యవసాయ పట్టు భద్రులను నియమించుకొని రైతులకు ఎప్పటి కప్పుడు సలహాలు ఇవ్వాలి 

9) రైతుల పంటకోత తరువాత ఎంత దిగుబడి వచ్చినది అన్న రసీదు ఇచ్చిన 10 రోజుల లోపు రైతుకు ఖాతాలోకి డబ్బులు ఇవ్వాలి 

10) ఏజెంట్స్ రైతుకు నష్టం జరిగే పని ఏమి చేసిన చట్ట పరంగా వారి మీద చర్యలు ఉంటాయి.